News February 18, 2025
జగన్ పర్యటనకు EC అనుమతి నిరాకరణ

AP: YCP అధినేత జగన్ రేపు ఉ.10.30గంటలకు గుంటూరులోని మిర్చి యార్డుకు వెళ్లి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులకు అండగా నిలబడతారని ఆ పార్టీ ట్వీట్ చేసింది. పెట్టుబడి రాలేదని మిర్చి రైతులు దిగాలు చెందారని, వారితో మాట్లాడి భరోసా కల్పిస్తారని పేర్కొంది. మిర్చి రైతులకు కూటమి ప్రభుత్వం కన్నీరు మిగిల్చిందని ఆరోపించింది. అయితే MLC ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జగన్ పర్యటనకు ఈసీ అనుమతి నిరాకరించింది.
Similar News
News January 25, 2026
ఆ ఛానల్ డిబేట్లలో పాల్గొనం: BRS

TG: ఏబీఎన్ ఛానల్‌లో జరిగే చర్చల్లో ఇకపై తమ పార్టీ నాయకులు పాల్గొనబోరని బీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో ఏబీఎన్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్, జిల్లా ఆఫీసుల్లో జరిగే సమావేశాలకు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులను ఇకపై అనుమతించబోమని ట్వీట్ చేసింది.
News January 25, 2026
సింగరేణిలో మిగిలిన స్కామ్‌లను బయటపెడతాం: హరీశ్ రావు

TG: స్వార్థ ప్రయోజనాల కోసమే సింగరేణిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారని BRS నేత హరీశ్ రావు ఆరోపించారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతోంది. సింగరేణి కార్మికులను కూడా ప్రభుత్వం మోసం చేస్తోంది. వారికి వైద్యాన్నీ దూరం చేశారు. సంస్థ అభివృద్ధి కోసం పక్కనపెట్టిన రూ.6వేల కోట్ల లెక్కతేల్చుతాం. సింగరేణిలో మిగిలిన స్కామ్‌లను బయటపెడతాం’ అని వ్యాఖ్యానించారు.
News January 25, 2026
రిపబ్లిక్ డే వేడుకల అతిథులు వీరే

EU నేతలు వాన్ డెర్, ఆంటోనియో (2026), ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో (2025), ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మేక్రాన్ (2024), ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ (2023), బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్సోనారో (2020), SA ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా (2019), ASEAN లీడర్లు (2018), అబుదాబి ప్రిన్స్ షేక్ మొహమద్ బిన్ (2017), ప్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ (2016), US ప్రెసిడెంట్ ఒబామా (2015), 2021, 22లో కొవిడ్‌తో గెస్ట్‌లు రాలేదు.


