News March 20, 2024
కేంద్రమంత్రిపై ఈసీ ఆగ్రహం

కేంద్ర మంత్రి శోభ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా కర్ణాటక సీఈవోను ఆదేశించింది. కాగా రామేశ్వరం పేలుళ్ల వెనుక తమిళుల పాత్ర ఉందని శోభ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు తన వ్యాఖ్యలపై శోభ క్షమాపణలు చెప్పింది.
Similar News
News April 3, 2025
భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. నాగర్కర్నూల్(D) పదర(M) కూడన్పల్లి సమీపంలో వ్యవసాయ పనులు చేస్తున్న ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వర్షాల సమయంలో రైతులు, కూలీలు చెట్ల కింద ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో 2 రోజులు భారీ వర్షాలు పడతాయని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
News April 3, 2025
కంచ గచ్చిబౌలి భూములు.. విచారణ వాయిదా

TG: కంచ గచ్చిబౌలి భూ విచారణను హైకోర్టు ఈ నెల 7కు వాయిదా వేసింది. ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా 400 ఎకరాల భూమిని అమ్మొద్దంటూ పిటిషనర్లు కోర్టును కోరారు.
News April 3, 2025
మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె నిద్ర చేయాలి: CM

AP: నెలలో 4 రోజుల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె నిద్ర చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్యాబినేట్ భేటీ అనంతరం సీఎం మంత్రులతో సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, చేసిన మంచిని చెప్పుకోవాలని సూచించారు. ఏపీ పథకాల్లో నాలుగో వంతు కూడా పొరుగు రాష్ట్రాల్లో అమలు చేయట్లేదన్నారు.