News May 10, 2024
పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ కీలక ఆదేశాలు

AP: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక జాబితాను ఆర్వోకు ఇవ్వాల్సిన అవసరం లేదని.. పోలింగ్ రోజు ప్రిసైడింగ్ అధికారికి సమర్పిస్తే చాలని వెల్లడించింది. అయితే పోలింగ్ ఏజెంట్లను ఆయా పార్టీల అభ్యర్థులు ధ్రువీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో ఏజెంట్ల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని స్పష్టం చేసింది.
Similar News
News December 15, 2025
2 రోజులు స్కూళ్లకు సెలవు

TG: రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఎల్లుండి జరగనున్నాయి. 4,158 సర్పంచ్, 36,434 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా 394 సర్పంచ్, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటైన స్కూళ్లకు రేపు, ఎల్లుండి సెలవులు ఉండనున్నాయి. అలాగే ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఉంటుంది.
News December 15, 2025
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 25,915 వద్ద, సెన్సెక్స్ 398 పాయింట్లు కోల్పోయి 84,869 వద్ద కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, ITC, రిలయన్స్, టైటాన్, TechM, ఇన్ఫీ, SBI, మారుతి, యాక్సిస్ బ్యాంక్, TCS, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ షేర్లు నష్టాల్లో చలిస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్, BEL, L&T షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
News December 15, 2025
తీవ్ర పొగమంచు.. మోదీ టూర్పై ఎఫెక్ట్

తీవ్ర పొగమంచు ప్రభావం ప్రధాని మోదీ విదేశీ పర్యటనపై పడింది. ఢిల్లీ ఎయిర్పోర్టును పొగమంచు దట్టంగా కమ్మేయడంతో ఆయన ప్రయాణం ఆలస్యమైంది. ఇవాళ ఉదయం 8.30 గంటలకే ఆయన బయల్దేరాల్సి ఉంది. ఈ నెల 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. కాగా ఉత్తర భారతంలో పొగమంచు వల్ల పలు రోడ్డు <<18561671>>ప్రమాదాలు<<>> చోటుచేసుకుంటున్నాయి. విమాన సర్వీసులపైనా తీవ్ర ప్రభావం పడింది.


