News May 10, 2024
సీఎం రేవంత్‌కు ఈసీ నోటీసులు

TG: కేసీఆర్‌పై దూషణలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగతంగా కేసీఆర్‌ను దూషించినందుకు, అసభ్యపదజాలం వాడిన ఘటనలపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో సీఎంకు ఈ నోటీసులు పంపింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని రేవంత్‌కు ఈసీ స్పష్టం చేసింది.
Similar News
News December 1, 2025
జనగామ: ప్రచారానికి ఏడు రోజులే..!

గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియడంతో సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థుల హడావుడి మొదలైంది. ప్రచారానికి ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు 7 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణ పూర్తయ్యాకే ప్రచారం నిర్వహిస్తారు. కానీ సమయం లేకపోవడంతో పట్టణాలకు బతుకుదెరువు కోసం వెళ్లిన ఓటర్లకు ఫోన్లు చేసి ఓట్లు వేసి పోవాలని మచ్చిక చేసుకుంటున్నారు.
News December 1, 2025
కాసేపట్లో వాయుగుండంగా బలహీనపడనున్న ‘దిత్వా’

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News December 1, 2025
ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో ఉద్యోగాలు

ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో 6 NHMS ఫీల్డ్ డేటా కలెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ(మాస్టర్ ఆఫ్ సైకాలజీ/సోషల్ వర్క్/సోషియాలజీ/రూరల్ డెవలప్మెంట్)అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.45వేలు జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. వెబ్సైట్: https://aiimsrajkot.edu.in/


