News April 26, 2024
మంత్రి కొండాకు ఈసీ నోటీసులు

TG: మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇటీవల కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈసీ ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల వేళ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా మరింత బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొంది.
Similar News
News January 19, 2026
‘చైనా ఆస్టర్’ సాగుకు అనువైన వాతావరణం

‘చైనా ఆస్టర్’ పువ్వులను కట్‌ఫ్లవర్‌గా, వేడుకల్లో డెకరేషన్ కోసం, పూజా కార్యక్రమాల్లో వాడుతుంటారు. ఈ పువ్వుల సాగుకు మంచి సూర్యరశ్మితో పాటు చల్లని వాతావరణం అవసరం. నీరు బాగా ఇంకే లోతైన ఎర్రగరప నేలలు వీటి సాగుకు అనుకూలం. IIHR బెంగళూరు రూపొందించిన కామిని, వయోలెట్, కుషన్, శశాంక్, అర్చనా, పూర్ణిమ రకాలు అధిక పూల దిగుబడిని అందిస్తాయి. ఈ మొక్కలను నాటిన 70 నుంచి 80 రోజులకు (రకాన్ని బట్టి) పూలు వస్తాయి.
News January 19, 2026
‘క్వాంటమ్’ కోర్సులో 50,000 మంది AP యువత

AP: క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సుకు రాష్ట్ర యువత నుంచి అధిక స్పందన లభిస్తోంది. NPTEL ప్లాట్‌ఫామ్ ద్వారా మద్రాస్ IIT, IBM అందిస్తున్న ఈ కోర్సులో 50,000 మంది ఎన్రోల్ అయ్యారు. దేశంలోనే AP ఈ అంశంలో ముందంజలో ఉంది. అటు IITల సహకారంతో 7-9 తరగతుల్లో క్వాంటమ్ పరిజ్ఞానంపై అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. ఈకోర్సులో గోల్డ్, సిల్వర్ మెడలిస్టులను సత్కరించనున్నామని CBN Xలో పేర్కొన్నారు.
News January 19, 2026
గణతంత్ర పరేడ్‌లో కీరవాణి నాదం.. తెలుగు వ్యక్తికి దక్కిన గౌరవం!

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత కీరవాణి ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరనుంది. ‘వందేమాతరం’ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సంగీతం అందించే బాధ్యతను ఆయన చేపట్టనున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 2500 మంది కళాకారులు ఈ చరిత్రాత్మక ఘట్టంలో భాగం కానున్నారు. ఈ విషయాన్ని కీరవాణి X వేదికగా వెల్లడించారు.


