News September 22, 2025
‘SIR’ అమలుకు ఈసీ ఆదేశాలు

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను అమలు చేసేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈనెల 30లోపు గతంలో ప్రచురించిన ఓటరు జాబితాలతో సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సీఈవోలకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రక్రియను అక్టోబర్-నవంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉందని సూత్రప్రాయంగా తెలిపింది. ఇప్పటికే బిహార్‌లో SIR అమలు చేయగా, అర్హుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే.
Similar News
News September 22, 2025
రాష్ట్ర ఉత్సవంగా గురజాడ జయంతి: కొండపల్లి

AP:సమాజంలోని దురాచారాలను తన రచనలతో మార్చిన మహాకవి గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. 150 ఏళ్లైనా ఆయన రచనలు, సాహిత్యం ఇంకా ప్రజాదరణ పొందుతున్నాయని తెలిపారు. గురజాడ జయంతి సందర్భంగా VZMలో ఆయన ఇంటిని సందర్శించిన మంత్రి, MP కలిశెట్టి దాని ఆధునికీకరణ, గ్రంథాలయ నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించారు.
News September 22, 2025
మీరూ చూసేయండి: కనక దుర్గమ్మ ఆభరణాలు

తొలి రోజు: బాలాత్రిపుర సుందరీదేవి(అభయ హస్తాలు, బంగారు పూల జడ, కంఠాభరణాలు)
రెండో రోజు: గాయత్రీ దేవి(స్వర్ణ పంచముఖాలు, అభయ హస్తాలు, పచ్చల హారం, శంఖు చక్రాలు, కిరీటం, కంఠాభరణం)
మూడో రోజు: అన్నపూర్ణాదేవి(త్రిశూలం, అభయ హస్తాలు, స్వర్ణపాత్ర)
నాలుగో రోజు: కాత్యాయనీ దేవి( స్వర్ణ కిరీటం, పచ్చల హారం, అభయ హస్తాలు)
ఐదో రోజు: మహాలక్ష్మీదేవి(కర్ణాభరణాలు, శంఖు, చక్రాలు, గద, వడ్డాణం, అభయ హస్తాలు, ధనరాశులు)
News September 22, 2025
మీరూ చూసేయండి: కనకదుర్గమ్మ ఆభరణాలు

ఆరో రోజు: లలితా త్రిపుర సుందరీదేవి(స్వర్ణాభరణాలు, కంఠాభరణాలు, అభయ హస్తాలు, బంగారు కిరీటం)
ఏడో రోజు: మహాచండీ దేవి(స్వర్ణ ఖడ్గం, కర్ణాభరణాలు, కంఠాభరణాలు, అభయ హస్తాలు)
ఎనిమిదో రోజు: సరస్వతీ దేవి: బంగారు వీణ, స్వర్ణ హస్తాలు, పగడపు హారాలు, వడ్డాణం)
తొమ్మిదో రోజు: దుర్గాదేవి(స్వర్ణ కిరీటం, బంగారు త్రిశూలం, సూర్య, చంద్రులు, శంఖుచక్రాలు)