News May 24, 2024
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి

తెలంగాణ అవతరణ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకలు జరగనున్నాయి. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్కులో అమరవీరులకు నివాళి అర్పించనున్నారు. ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
Similar News
News October 18, 2025
ఇవాళ ఒక్కరోజే 23వేల అప్లికేషన్లు

TG: లిక్కర్ షాప్స్‌కు ఈరోజు రికార్డు స్థాయిలో అప్లికేషన్స్ వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇవాళ ఒక్కరోజే 23 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం 50వేలు దాటాయని పేర్కొంది. శనివారం చివరి రోజు కావడంతో మరో 50 వేలు అప్లికేషన్స్ వస్తాయని అంచనా వేస్తోంది. కాగా రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.
News October 18, 2025
ఒకేసారి ఇద్దరు యువతులతో యువకుడి పెళ్లి!

ఒక్కరితో సంసారమే కష్టమవుతోన్న ఈ రోజుల్లో ఓ యువకుడు ఒకేసారి ఇద్దరు యువతుల్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగింది. వసీమ్ షేక్ తన ఇద్దరు స్నేహితురాళ్లు షిఫా షేక్, జన్నత్‌ను ఒకే వేదికపై పెళ్లాడాడు. వాళ్లు ముగ్గురూ చాలా ఏళ్లుగా క్లోజ్ ఫ్రెండ్స్ అని, ఒకరి భావోద్వేగాలను మరొకరు అర్థం చేసుకుని ఇలా ఒక్కటయ్యారని సన్నిహితులు తెలిపారు. దీనిపై SMలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News October 17, 2025
ఆంధ్రప్రదేశ్ న్యూస్ రౌండప్

➤ రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఉద్యోగుల సమస్యలపై చర్చ
➤ కృష్ణా జిల్లాలోని వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడపగా మార్చిన ప్రభుత్వం
➤ పిఠాపురం వర్మను జీరో చేశామని నేననలేదు. నా మాటలను వక్రీకరించారు: మంత్రి నారాయణ
➤ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ OCT 24కు పొడిగింపు
➤ న్యూయార్క్ వెళ్లేందుకు MP మిథున్ రెడ్డికి షరతులతో కూడిన అనుమతి జారీ చేసిన ఏసీబీ కోర్టు