News May 11, 2024
ఏపీలో పోలింగ్ టైమింగ్స్ విడుదల చేసిన ఈసీ

ఏపీలో 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఆ సమయంలోగా క్యూలైన్లో నిల్చున్న వారికి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తారు.
Similar News
News December 3, 2025
నేపియర్ కంటే 4G బుల్లెట్ సూపర్ నేపియర్ ఎందుకు ప్రత్యేకం?

నేపియర్ గడ్డి ముదిరితే కాండం కాస్త గట్టిగా ఉంటుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్ కాండం ముదిరినా లోపల డొల్లగా ఉండి, పాడి పశువు తినడానికి సులువుగా ఉంటుంది. నేపియర్తో పోలిస్తే దీనిలో తీపిదనం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ గడ్డి చాలా గుబురుగా పెరుగుతుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్లో ప్రొటీన్ కంటెంట్, దిగుబడి, మొక్కలు పెరిగే ఎత్తు, మొక్క ఆకుల్లోని మృదుత్వం.. సాధారణ నేపియర్ గడ్డి కంటే ఎక్కువగా ఉంటుంది.
News December 3, 2025
సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేయాలి?

సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడానికి ఏకాదశి, పౌర్ణమి తిథులు అత్యంత శుభప్రదమైనవిగా పండితులు సూచిస్తారు. కొత్తగా ఉద్యోగం, వ్యాపారం ప్రారంభించే ముందు ఈ వ్రతం చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇంట్లో సుఖశాంతులు, సానుకూల శక్తి కోసం, గృహ దోషాలు తొలగిపోవడానికి ఈ వ్రతం చేస్తారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి శుభ దినాలలో చేస్తే విశేష ఫలితాలుంటాయని నమ్మకం. ఈ వ్రతం గురించి మరింత సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News December 3, 2025
సత్యనారాయణస్వామి వ్రతం: ఏయే పూజలుంటాయి?

సత్యనారాయణస్వామి వ్రతంలో మొదటగా విఘ్నాలను తొలగించే వినాయకుడికి తొలి పూజలు చేస్తారు. ఆ తర్వాత కలశారాధన, పంచలోక పాలక పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రధాన దైవమైన సత్యనారాయణ స్వామికి షోడశోపచార పూజలు, పంచామృత స్నానాలు, అష్టోత్తర శతనామ పూజలు సమర్పిస్తారు. చివరగా వ్రత కథను చదివి, హారతి ఇచ్చి, ప్రసాదం పంపిణీ చేయడంతో వ్రతం పూర్తవుతుంది.


