News March 19, 2024
24 గంటల వ్యవధిలోనే డీజీపీని మార్చిన ఈసీ

ఈసీ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. 24 గంటల వ్యవధిలోనే పశ్చిమబెంగాల్ డీజీపీని మార్చింది. నిన్న రాజీవ్ కుమార్ స్థానంలో వివేక్ సహాయ్‌ను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన స్థానంలో సంజయ్ ముఖర్జీని నియమించింది. ఈసీ నిర్ణయం కాస్త రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
Similar News
News July 8, 2025
కేటీఆర్ అడ్డగోలు మాటలు మానుకోవాలి: భట్టి

TG: సీఎం రేవంత్ సవాల్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే <<16989439>>కేటీఆర్<<>> జీర్ణించుకోలేకపోతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. కేటీఆర్ అడ్డగోలు మాటలు మానుకోవాలని ఫైరయ్యారు. భవిష్యత్తులో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని విమర్శించారు. దమ్ముంటే అసెంబ్లీలో తేల్చుకుందామని, చర్చకు కేసీఆర్ రావాలని సవాల్ చేశారు. గోదావరి, కృష్ణ జలాలపై చర్చించేందుకు సిద్ధమన్నారు.
News July 8, 2025
విమాన లగేజీ రూల్స్‌పై చర్చ.. మీరేమంటారు?

విమానంలో ప్రయాణించే వారు తీసుకువెళ్లే లగేజీలపై ఆంక్షలు ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే, ఈ రూల్‌పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. 100 కేజీలున్న ఓ వ్యక్తి 24kgల లగేజీని తీసుకెళ్తే ఓకే చెప్తారని, అదే 45kgలున్న మరో వ్యక్తి 26kgల లగేజీ తెస్తే అడ్డు చెప్తారని ఓ యువతి ట్వీట్ చేసింది. ఈ పోస్టుకు 24 గంటల్లోనే 85లక్షల వ్యూస్ లక్ష లైక్స్ వచ్చాయి. యువతి చెప్పిన విషయం కరెక్ట్ అని పలువురు మద్దతు తెలుపుతున్నారు.
News July 8, 2025
ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: లోకేశ్

APలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని మంత్రి లోకేశ్ అన్నారు. బెంగళూరులో GCC గ్లోబల్‌లీడర్లతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా AI, క్వాంటమ్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ‘USA సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. 6 నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుంది. టెక్నాలజీలో క్వాంటమ్ వ్యాలీ గేమ్‌ఛేంజర్‌గా నిలవనుంది. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రాయితీలు ఇస్తున్నాం’ అని తెలిపారు.