News September 24, 2025
5 రాజ్యసభ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల

జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో ఖాళీగా ఉన్న 5 రాజ్యసభ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లో 4, పంజాబ్‌లో ఒక సీటు(ఉపఎన్నిక) ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 6న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న పరిశీలన, 16న ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్లు లెక్కింపు ప్రారంభం అవుతుంది.
Similar News
News September 24, 2025
మైథాలజీ క్విజ్ – 15 సమాధానాలు

1. రామ-రావణ యుద్ధంలో రాముని రథసారథి ‘మాతలి’.
2. గాంధారి తండ్రి ‘సుబలుడు’.
3. బలరాముడి తల్లి ‘రోహిణి’. దైవిక జోక్యం వల్ల బలరాముడు దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలోకి బదిలీ అవుతాడని గ్రంథాలు చెబుతున్నాయి.
4. కేదార్‌నాథ్ దేవాలయం ‘మందాకిని’ నది ఒడ్డున ఉంది.
5. తైపూసం అనే పండుగను ‘తమిళనాడు’ రాష్ట్రంలో జరుపుకొంటారు.
<<-se>>#mythologyquiz<<>>
News September 24, 2025
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి: ఉప రాష్ట్రపతి

AP: ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని వివరించారు. అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో విజయవాడ ముందు వరుసలో ఉందని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు వెళ్లారు.
News September 24, 2025
జగన్ పిటిషన్‌పై స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

AP: LoPగా తనను గుర్తించేందుకు నిరాకరిస్తూ ఇచ్చిన రూలింగ్ చట్టవిరుద్ధమని, ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేసింది. సభాపతి అయ్యన్న, సభా వ్యవహారాల మంత్రి కేశవ్, కార్యదర్శికి కోర్టు నోటీసులిచ్చింది. విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది.