News May 3, 2024
రాజకీయ పార్టీలకు EC హెచ్చరిక
ఎన్నికల వేళ సర్వేలు, పథకాల లబ్ధి సాకులతో ఓటర్ల వివరాలు సేకరిస్తే రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఈ చర్యలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లపై ప్రచురణకర్తలు, ప్రింటింగ్ వివరాలు లేకపోతే చర్యలు తీసుకోవాలంది.
Similar News
News December 27, 2024
ఇవాళ కాలేజీలకు సెలవు
TG: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా రాష్ట్రంలోని కాలేజీలకు కూడా సెలవు ఇచ్చారు. ఈమేరకు JNTU, కాకతీయ, ఓయూ తదితర యూనివర్సిటీలు ప్రకటన చేశాయి. ఆయా వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ఇవాళ జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటికే స్కూళ్లకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అటు ఏపీలో ఎలాంటి సెలవు ప్రకటించలేదు.
News December 27, 2024
Stock Markets: లాభాల్లో పరుగులు..
స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందాయి. ఇన్వెస్టర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న మంచి స్టాక్స్ను కొంటున్నారు. సెన్సెక్స్ 78,896 (+424), నిఫ్టీ 23,858 (+108) వద్ద ట్రేడవుతున్నాయి. రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. బ్యాంకు, ఫార్మా, హెల్త్కేర్ షేర్లు జోరుమీదున్నాయి. BAJAJAUTO, TATAMOTORS, DRREDDY, EICHERMOT, INDUSIND టాప్ గెయినర్స్.
News December 27, 2024
మా హృదయాల్లో మన్మోహన్ స్థానం శాశ్వతం: రేవంత్
TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను స్మరించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘అగాధపు అంచుల నుంచి అద్భుత ప్రస్థానం వరకు.. భారత ఆర్థిక వ్యవస్థకు భాగ్య విధాత. మన్మోహన్ జీ.. మా హృదయాల్లో మీ స్థానం శాశ్వతం’ అని పేర్కొన్నారు. ఇవాళ సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. మన్మోహన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు.