News October 25, 2025

ఏఐ ఫేక్ వీడియో, ఇమేజ్‌లపై ECI ఆదేశాలు

image

బిహార్ ఎన్నికల్లో AIవీడియోలు, ఇమేజ్‌లతో ప్రచారాలు మిన్నంటాయి. వీటిలో కొన్ని ఓటర్లను తప్పుదోవ పట్టించేలా ఉండటంతో EC కొత్త రూల్స్ ప్రకటించింది. వీడియో, ఇమేజ్‌ల పైభాగంలో స్పష్టమైన లేబుల్ ఉండాలి. తయారీదారు పేరుండాలి. అవమానపరిచేలా, అనుమతిలేని ఇతరుల స్వరాలు, స్వరూపాలతో ఆడియో, వీడియోలు ప్రచారం చేయరాదు. తప్పుడు కంటెంట్ ఉంటే 3గం.లో హ్యాండిళ్ల నుంచి తొలగిస్తారు. పార్టీలు వీటిపై రికార్డులు నిర్వహించాలి.

Similar News

News October 25, 2025

కర్నూలు బస్సు ప్రమాదం.. కారణం ఇదే

image

AP: కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీని పోలీసులు ఛేదించారు. శివశంకర్ మిత్రుడు ఎర్రిస్వామిని విచారించి కీలక విషయాలు వెల్లడించారు. ‘బంక్‌లో పెట్రోలు పోయించాక బండిని శివశంకర్ నడిపాడు. బైక్ స్కిడ్ అయ్యి కుడివైపు డివైడర్‌ను ఢీకొట్టింది. శివశంకర్ స్పాట్‌లో చనిపోయాడు. దీంతో గాయపడ్డ ఎర్రిస్వామి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రోడ్డుపై ఉన్న బైక్‌ని బస్సు ఈడ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగింది’ అని తెలిపారు.

News October 25, 2025

70 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్(NSIC) 70 మేనేజర్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. డిగ్రీ, MBA, CA, CMA, BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 27 నుంచి NOV 16 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1,500. SC, ST, PWBD, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది. వెబ్‌సైట్: https://nsic.co.in.
*మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 25, 2025

పల్లీలే కదా అని తేలిగ్గా తీసిపారేయొద్దు!

image

ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌ను మించిన ప్రయోజనాలు పల్లీల్లో ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఎక్కువ కాలం జీవించేందుకు కావాల్సిన 20 అమైనో ఆమ్లాలు వీటిలో ఉన్నాయని తెలిపారు. ‘పల్లీల్లోని ప్రొటీన్ బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్, బీపీలను తగ్గించి గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. డయాబెటిస్, క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది’ అని చెబుతున్నారు. అందుకే ఎప్పుడూ తినే పల్లీలను తేలిగ్గా తీసిపారేయొద్దు.