News January 21, 2025

ECILలో ఉద్యోగాలు.. శాలరీ రూ. 2,80,000

image

కాంట్రాక్ట్ బేసిక్ కింద ఖాళీగా ఉన్న జనరల్ మేనేజర్ 4, సీనియర్ మేనేజర్ 6 పోస్టులను ECIL భర్తీ చేస్తోంది. MBA, PG, PG డిప్లొమా ఉత్తీర్ణులై.. అనుభవం ఉన్నవారు అర్హులు. ఫైనాన్స్, HR, డిఫెన్స్ సిస్టమ్ తదితర విభాగాల్లో GM పోస్టులకు నెలకు రూ. 1.20 లక్షల నుంచి 2.80 లక్షల Pay Scale ఉంటుంది. సీనియర్ మేనేజర్‌కు Pay Scale రూ. 70 వేల నుంచి రూ. 2 లక్షలు చెల్లిస్తారు. అప్లై చేసేందుకు జనవరి 31 చివరి తేదీ.
SHARE IT

Similar News

News January 22, 2025

HYD నుంచి బీదర్ వరకు IAF టీం సైకిల్ యాత్ర

image

HYD బేగంపేట నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ వరకు 20 మంది సభ్యులతో కూడిన IAF బృందం సైకిల్ యాత్ర చేసినట్లుగా తెలిపింది. ఇందులో ఇద్దరు మహిళ ఆఫీసర్లు ఉన్నట్లుగా పేర్కొంది. బీదర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేయడం పట్ల త్రివిధ దళాల అధికారులు వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. IAF అధికారుల సైకిల్ యాత్రను పలువురు ప్రశంసిస్తున్నారు.

News January 22, 2025

HYD: పద్మరావుతో ఫోన్‌లో మాట్లాడిన KTR

image

డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. స్వల్ప అస్వస్థకు గురైన ఆయన ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. తాను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు పద్మారావు కేటీఆర్‌తో చెప్పినట్లు సమాచారం.

News January 21, 2025

ఖైరతాబాద్‌లో అక్కినేని నాగ చైతన్య

image

ఖైరతాబాద్‌లో అక్కినేని నాగ చైతన్య సందడి చేశారు. మంగళవారం తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు ఆయన వివరాలు తీసుకొని, ప్రక్రియను పూర్తి చేశారు. హీరో రాకతో కార్యాలయం సందడిగా మారింది. పలువురు అధికారులు ఆయనతో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను అక్కినేని ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.