News January 29, 2025
ECILలో జాబ్స్.. రూ. 2.80 లక్షల జీతం
కాంట్రాక్ట్ బేసిక్ కింద జనరల్ మేనేజర్ 4, సీనియర్ మేనేజర్ 6 పోస్టులను ECIL భర్తీ చేస్తోంది. MBA, PG, PG డిప్లొమా ఉత్తీర్ణులై, అనుభవం ఉన్నవారు అర్హులు. ఫైనాన్స్, HR, డిఫెన్స్ సిస్టమ్ తదితర విభాగాల్లో GM పోస్టులకు నెలకు రూ. 1.20 లక్షల నుంచి 2.80 లక్షల జీతం ఉంటుంది. సీనియర్ మేనేజర్లకు రూ. 70 వేల నుంచి రూ. 2 లక్షల జీతం చెల్లిస్తారు. అప్లే చేసేందుకు JAN 31 చివరి తేదీ. LINK: www.ecil.co.in
SHARE IT
Similar News
News January 30, 2025
UPDATE: పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు
మీర్‌పేట్ PS పరిధిలో భార్యను అతికిరాతకంగా హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే హత్య చేసిన అనంతరం పిల్లలను ఇంటికి తీసుకొచ్చే క్రమంలో వారికి అల్పాహారం తినిపించాడు. ఇల్లంతా దుర్వాసన వస్తుందని పిల్లలు అనగా ఎయిర్ ఫ్రెషనర్‌తో దుర్వాసన పోగొట్టేందుకు ప్రయత్నించాడు. అనంతరం వారికి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. ప్రస్తుతం పిల్లలు అమ్మమ్మ వద్ద ఉంటున్నట్లు సమాచారం.
News January 30, 2025
హైదరాబాద్‌లో ఏం జరగనుంది?
మరో ఏడాదిలో GHMCకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు నేటి సర్వసభ్య సమావేశాన్ని సవాల్‌గా తీసుకున్నాయి. నేటి సమావేశంలో అవిశ్వాసం, రూ.8వేల కోట్ల బడ్జెట్‌పై చర్చకు పార్టీలు సిద్ధమయ్యాయి. వీటన్నింటిని యుక్తితో ఎదుర్కోవాలని కాంగ్రెస్ కౌన్సిలర్‌లకు సూచించింది. అవిశ్వాసానికి BRSకు సంఖ్యాబలం లేదని మేయర్ విజయలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన ఫండ్ కోసం కార్పొరేటర్లు పట్టుబట్టనున్నారు
News January 30, 2025
Politics: నేడు దద్దరిల్లనున్న GHMC!
నేటి GHMC కౌన్సిల్ మీటింగ్‌తో హాల్ దద్దరిల్లనుంది. 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించడం ఎజెండా. అయితే, FEB 11న గవర్నింగ్ బాడీకి 4 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సమయంలో మేయర్‌పై BRS అవిశ్వాసానికి ప్లాన్ చేయగా, కౌన్సిల్ మీటింగ్‌లో BJP గళం వినిపించాలని ఆ పార్టీ అగ్రనేతలు కార్పొరేటర్లకు సూచించారు. ఇక HYDలో బలం పెంచుకున్న INC వీటిని తిప్పికొట్టే యోచనలో ఉంది. దీంతో ఈ కౌన్సిల్ మీటింగ్ పొలిటికల్ హీట్ పెంచింది.