News November 4, 2024
Ecommerce Festive Sales: నెల రోజుల్లో రూ.లక్ష కోట్లు

ఈ పండగ సీజన్లో ఇ-కామర్స్ ప్లాట్ఫామ్స్ సేల్స్ ఏకంగా రూ.లక్షకోట్లు దాటేశాయి. నాన్ మెట్రో కస్టమర్ల నుంచి ప్రీమియం బ్రాండ్లకు డిమాండ్ పెరిగిందని డాటమ్ ఇంటెలిజెన్స్ తెలిపింది. దీంతో సేల్స్ 23% వృద్ధితో రూ.81వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెరిగాయంది. సీజన్ మొదటి వారంలోనే సగం అమ్మకాలు నమోదయ్యాయని, స్మార్ట్ ఫోన్లు, గ్రాసరీ, బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్, కిచెన్ ఐటెమ్స్ ఎక్కువగా అమ్ముడయ్యాయని పేర్కొంది.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


