News September 30, 2024
ఆర్థిక సంక్షోభం.. పాక్లో 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగింపు

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో IMF నుంచి లోన్ పొందేందుకు పాకిస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా పరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 6 మంత్రిత్వ శాఖలను రద్దు చేసి, మరో రెండు శాఖలను విలీనం చేయనుంది. దీంతో పాక్కు 7 బిలియన్ డాలర్లు లోన్ ఇచ్చేందుకు IMF సిద్ధమైంది. తొలి విడతగా 1బిలియన్ డాలర్లను రిలీజ్ చేసింది.
Similar News
News December 2, 2025
గొర్రెలకు సంపూర్ణాహారం అందకపోతే జరిగేది ఇదే

గొర్రెలకు సరైన పోషకాహారం అందకుంటే పెరుగుదల లోపించి త్వరగా బరువు పెరగవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా వ్యాధుల బారిన పడతాయి. అంతర, బాహ్య పరాన్న జీవుల కారణంగా గొర్రెలకు వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గొర్రెల ఉన్ని రాలిపోతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. గర్భస్రావాలు, పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా జన్మించడం, సకాలంలో ఎదకు రాకపోవడం, ఈతల మధ్య వ్యవధి పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
News December 2, 2025
IPLకు మరో స్టార్ ప్లేయర్ దూరం!

ఐపీఎల్-2026కు మరో స్టార్ ప్లేయర్ దూరమైనట్లు తెలుస్తోంది. ఈ నెలలో జరిగే మినీ వేలం కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ రిజిస్టర్ చేసుకోలేదని సమాచారం. గత సీజన్లో మ్యాక్సీ పంజాబ్ తరఫున ఆడగా తిరిగి రిటైన్ చేసుకోని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వచ్చే సీజన్ ఆడేది అనుమానమేనని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే డుప్లెసిస్, రసెల్ వంటి స్టార్లు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
News December 2, 2025
మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

మెంతులను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలుంటాయని తెలిసిందే. కానీ గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల కొన్నిసార్లు అబార్షన్ కావడం, పుట్టే బిడ్డలో మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అనే జన్యు సంబంధిత సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్లలో ఈస్ట్రోజెన్ ఆధారిత కణితులను ఇది మరింత ప్రేరేపిస్తుందంటున్నారు. కాబట్టి వీటిని వాడేముందు వైద్యుల సలహా తప్పనిసరి అని సూచిస్తున్నారు.


