News October 3, 2025
రేవంత్ పాలనలో ఆర్థిక విధ్వంసం: KTR

TG: అరాచకత్వం, అనుభవలేమితో ఉన్న రేవంత్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురవుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సెప్టెంబర్‌లో GST వసూళ్లలో తెలంగాణ అట్టడుగున ఉండటం దారుణమని దుయ్యబట్టారు. రెండేళ్ల క్రితం KCR పాలనలో తెలంగాణ తొలి స్థానంలో ఉందని గుర్తు చేశారు. తమ హయాంలో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలూ నేల చూపులే చూస్తున్నాయని మండిపడ్డారు.
Similar News
News October 3, 2025
మద్రాస్ హైకోర్టులో TVK పార్టీకి చుక్కెదురు

కరూర్ (TN) తొక్కిసలాటపై TVK పార్టీకి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. కేసును CBIకి అప్పగించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నందున ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. ప్రజలకు నీళ్లు, ఆహారం కల్పించకుండా సభ ఎలా నిర్వహించారని నిలదీసింది. రోడ్డు మధ్యలో సభకు ఎందుకు అనుమతించారని పోలీసులను ప్రశ్నించింది. బాధితులకు పరిహారం పెంపుపై 2వారాల్లో సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
News October 3, 2025
బ్రహ్మ సృష్టిలో ఎన్ని లోకాలో మీకు తెలుసా?

ఇతిహాసాలు, పురాణాల ప్రకారం.. బ్రహ్మదేవుని సృష్టిలో చతుర్దశ(14) భువనాలు కలవు. మానవులమైన మనం నివసించే భూలోకం కేంద్రంగా, దీనికి పైన సత్యలోకం వరకు ఏడు ఊర్ధ్వలోకాలు(స్వర్గ లోకాలు) ఉన్నాయి. అలాగే, భూలోకానికి కింద పాతాళం వరకు ఏడు అధోలోకాలు(నరక లోకాలు) కలవు. ఈ విధంగా సప్త ఊర్ధ్వ లోకాలు, సప్త (7) అధోలోకాలు కలిసి మొత్తం 14 లోకాలున్నాయి. <<-se>>#14Bhuvanaalu<<>>
News October 3, 2025
అర్ధసెంచరీలు చేసిన జురెల్, జడేజా

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమ్ ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 218 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోగా జురెల్(68*), జడేజా(50*) అర్ధసెంచరీలతో ఇన్నింగ్సును చక్కదిద్దారు. ఐదో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 326/4 కాగా 164 రన్స్ ఆధిక్యంలో ఉంది.