News April 18, 2024

పదేళ్లలో ఈడీ దూకుడు

image

ED గత పదేళ్లలో దూకుడు పెంచింది. మన్మోహన్ పాలనలో 1,797 కేసులు నమోదు కాగా.. మోదీ ప్రధాని అయ్యాక ఏకంగా 5,155 కేసులు నమోదయ్యాయి. అప్పుడు 29మందిని అరెస్టు చేస్తే ఈ పదేళ్లలో 755మందిని అరెస్టు చేసింది. మోదీ పాలనలో రూ.1,21,618కోట్ల ఆస్తులను జప్తు చేసింది. యూపీఏ హయాంతో పోల్చితే ఎన్డీయే పాలనలో 86రెట్లు ఈడీ సోదాలు నిర్వహించింది. 2005లోనే PMLA అమల్లోకి వచ్చినా.. శిక్షలు మాత్రం 2014 నుంచే మొదలయ్యాయి.

Similar News

News November 18, 2024

గాలి కాలుష్యంతో ఏటా 20 లక్షల మంది మృతి!

image

దేశంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణాంతక వ్యాధులతో ఏటా లక్షల మంది చనిపోతున్నారని ఆందోళన చెందుతుంటాం. అయితే, నాణ్యమైన గాలిని పీల్చుకోలేకపోవడం వల్ల కూడా ఏటా ఇండియాలో దాదాపు 20 లక్షల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారనే విషయం మీకు తెలుసా? కలుషితమైన గాలిని పీల్చి శ్వాసకోశ వ్యాధులు, ఇతర రోగాలతో బాధపడుతూ నిత్యం 5400 మంది ప్రాణాలు విడుస్తున్నారు. ప్రభుత్వం ఈ మహమ్మారిపై దృష్టిసారించాలని నెటిజన్లు కోరుతున్నారు.

News November 18, 2024

అభివృద్ధితో పాటు స్వచ్ఛమైన గాలినీ అందించే నగరాలు!

image

ఓ వైపు అభివృద్ధిలో దూసుకెళ్తూనే మరోవైపు నగరవాసులకు స్వచ్ఛమైన గాలిని అందించే మార్గాలను అన్వేషిస్తున్నాయి బెంగళూరు, చెన్నై నగరాలు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్కడ పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. వాయు నాణ్యత సూచీలో వాయు నాణ్యత బెంగళూరులో 82, చెన్నైలో 82గా ఉంది. ఇక కొచ్చిలో అత్యల్పంగా 13AQIతో స్వచ్ఛమైన వాయువు లభించే సిటీగా నిలిచింది.

News November 18, 2024

సీఎం చంద్రబాబుకు బొత్స లేఖ

image

AP సీఎం చంద్రబాబు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. విజయనగరంలో పలువురు భూములు ఆక్రమించారంటూ వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని కోరారు. ఆరోపణలున్న అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.