News November 14, 2024

DMK బిగ్గెస్ట్ డోనర్‌పై ED దాడులు.. WHAT NEXT?

image

తమిళనాడులో యాక్టర్ విజయ్ జోసెఫ్ కొత్త పార్టీతో అధికార DMKకు ఇప్పటికే తలనొప్పి ఎదురైనట్టు విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీకి బిగ్గెస్ట్ ఫండ్ డోనర్, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్‌ ఆస్తులపై ఈడీ నేడు దాడులు చేపట్టడం సంచలనంగా మారింది. DMKకు వచ్చిన 90% ఎలక్టోరల్ బాండ్లను ఆయనే కొన్నారు. గతేడాది దాడుల్లోనే రూ.450 కోట్ల ఆయన ఆస్తుల్ని అటాచ్ చేసిన ED ఈసారి ఏం చేస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.

Similar News

News December 22, 2025

పదేళ్లలో ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు: జూపల్లి

image

TG: పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని <<18633566>>KCR<<>>ను మంత్రి జూపల్లి ప్రశ్నించారు. ‘BRS పాలనలో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. వారి హయాంలో ప్రధాన కాలువలు పూర్తి చేయలేదు. పాలమూరు-RRని తాగునీటి ప్రాజెక్టు అని సుప్రీంకోర్టులో కేసు వేసిన KCR ఇప్పుడేమో సాగునీటి ప్రాజెక్టు అంటున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.40-50 వేల కోట్లు కావాలి’ అని చెప్పారు.

News December 22, 2025

మినుము, పెసర.. 20 రోజులు దాటాకా కలుపు నివారణ

image

మినుము, పెసర విత్తిన 20 రోజులకు గడ్డిజాతికి చెందిన కలుపు మొక్కలు మాత్రమే 2,3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఎకరాకు 200 లీటర్ల నీటిలో క్విజాలోఫాప్ ఇథైల్ 5% 400ml లేదా ప్రొపాక్విజాఫాప్ 10% 250ml కలిపి పిచికారీ చేయాలి. పొలంలో గడ్డిజాతి, వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200ml లేదా ఫోమెసాఫెన్ 11.1% + ఫ్లుజిఫాప్-పి-బ్యుటెల్ 11.1% 400 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.

News December 22, 2025

యూనిసెఫ్ ‘ఫొటో ఆఫ్ ది ఇయర్’ ఇదే!

image

అఫ్గాన్‌లో బాలికల విద్యపై ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ ఎలిస్ బ్లాంచర్డ్ తీసిన చిత్రానికి యూనిసెఫ్ ‘ఫొటో ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. మారుమూల గ్రామంలో ఓ ఇంట్లో చదువుకుంటున్న హజీరా(10) ఫొటో ఇందుకు ఎంపికైంది. తాలిబన్ల పాలనలో బాలికలు స్కూలుకు వెళ్లడం నిషేధం. దీంతో 22 లక్షల మంది అమ్మాయిలు చదువుకు దూరమవుతున్నారు. ఇలాంటి వారిలో హజీరా ఒకరు. అఫ్గాన్‌లో బాలికలకు విద్య అసాధ్యమైన కలగా మారిందని యూనిసెఫ్ పేర్కొంది.