News April 2, 2024
మహువా మొయిత్రాపై ఈడీ కేసు

టీఎంసీ నేత మహువా మొయిత్రాపై ED మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. పార్లమెంట్లో ప్రశ్నలకు ముడుపుల కేసులో మహువాపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసింది. బిజినెస్ మ్యాన్ దర్శన్ హీరానందానీ కోసం పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారని.. ఇందుకుగానూ ఆమె ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీబీఐ విచారిస్తోంది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాగా మహువా కృష్ణానగర్ నుంచి MPగా పోటీ చేస్తున్నారు.
Similar News
News November 26, 2025
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

సీఎం చంద్రబాబు నాయుడు వచ్చేనెల 1న ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లను SP ప్రతాప్ శివ కిషోర్ బుధవారం పరిశీలించారు. ఆయన వెంట ఏలూరు DSP శ్రావణ్ కుమార్తో కలిసి హెలిపాడ్ ప్రాంతం, పార్కింగ్ ప్రాంతాలు, సభా ప్రాంతం, పర్యటనా ప్రాంతాలను పరిశీలించారు.
News November 26, 2025
తుఫాను ముప్పు తప్పింది.. అల్పపీడనం దూసుకొస్తోంది

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుఫాను ఇండోనేషియా వైపు పయనిస్తోంది. దీంతో రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పిందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడి ఈ నెల 29న తమిళనాడు వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
News November 26, 2025
హనుమాన్ చాలీసా భావం – 21

రామ దువారే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైఠారే ||
శ్రీరాముని సన్నిధికి ఆంజనేయస్వామి ద్వారపాలకుడిగా ఉంటాడు. ఆయన అనుమతి లేకుండా శ్రీరాముని చెంతకు ఎవరూ చేరలేరు. ఆ శ్రీరాముడు మనల్ని చల్లగా చూడాలంటే హనుమంతుడి అనుగ్రహం కూడా తప్పనిసరి. రామయ్యకు అత్యంత ప్రీతిపాత్రుడైన, శక్తిమంతుడైన భక్తుడు హనుమంతుని పూజిస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. త్వరగా మోక్షం లభిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>


