News July 8, 2024
ED, CBI కేసులు ఉంటే చేర్చుకోం: సంజయ్

TG: ఇతర పార్టీల నుంచి గెలిచిన నేతలు BJPలోకి రావాలంటే తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అలాగే ED, CBI కేసులు ఉన్న నేతలను చేర్చుకునేది లేదన్నారు. MP కేకేతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ నేతలు.. ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల MLAలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. రాజీనామా చేయిస్తే వచ్చే ఉపఎన్నికల్లో అన్ని సీట్లను BJP కైవసం చేసుకుంటుందన్నారు.
Similar News
News December 11, 2025
పత్తి రైతులను కేంద్రం ఆదుకోవాలి: MP లావు

AP: రాష్ట్రంలోని పత్తి రైతుల సమస్యలను MP లావు శ్రీకృష్ణ దేవరాయలు లోక్సభ దృష్టికి తీసుకెళ్లారు. ‘కేంద్రం AP పత్తి రైతులను ఆదుకోవాలి. ‘మొంథా తుఫాను వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తేమశాతం ఎక్కువగా ఉన్న, రంగు మారిన పత్తిని కూడా CCI కొనుగోలు చేసేలా కేంద్రమే చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. పత్తి కొనుగోళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చిస్తోంది.
News December 11, 2025
అఖండ-2 టికెట్ రేట్ల పెంపు జీవో సస్పెండ్

అఖండ-2 సినిమా <<18531616>>నిర్మాతలకు<<>> తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రీమియర్ షో టికెట్ల ధరల పెంపు జీవోను సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. అటు ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రీమియర్స్ మొదలవనుండగా ఇప్పటికే అభిమానులు రూ.600 పెట్టి టికెట్లు కొనుగోలు చేశారు.
News December 11, 2025
భారత సంగీతానికి ప్రపంచ కీర్తి తెచ్చిన గాయని

సంగీత ప్రపంచంలో మొదటగా భారతరత్న అవార్డు, రామన్ మెగసెసే పురస్కారం పొందిన మొదటి కళాకారిణి MS సుబ్బులక్ష్మి. 1916 సెప్టెంబరు 16న మదురైలో జన్మించిన ఆమె తన మధురగానంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆ మహాగాయిని వర్థంతి నేడు. లండన్లో క్వీన్ ఎలిజబెత్ సమక్షంలో పాడి శ్రోతలను తన స్వరంతోనే కట్టి పడేసి భారతదేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత సుబ్బులక్ష్మి గారిది.


