News April 4, 2024
కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ కౌంటర్

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన BRS ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొదని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ కౌంటర్ పిటిషన్ వేసింది. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందన్న ఈడీ.. ఈ కేసులో మరికొందరిని ప్రశ్నిస్తున్నామని, ఈ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోరింది. ఈడీ కౌంటర్‌కు రీజాయిండర్ వేసేందుకు కవిత లాయర్లు సమయం కోరారు. ఈ కేసులో గత నెల 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది.
Similar News
News September 19, 2025
కేసీఆర్‌కు ఉసురు తాకి కూతురు దూరమైంది: రేవంత్ రెడ్డి

TG: ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమం పేరుతో ఆయన ఎంతో మంది యువతను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ఉసురు తాకి కూతురు(కవిత) దూరమైందని వ్యాఖ్యానించారు. గతంలో తననూ కూతురి పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు.
News September 19, 2025
కండువా కప్పుకుంటే పార్టీ మారినట్లేనా: రేవంత్

ఒక ప్రజా ప్రతినిధి మరొక పార్టీ జెండా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కాసేపటి క్రితం నేను కూడా కొందరికి కండువాలు కప్పాను. ఆ కండువా ఏంటో కూడా వాళ్ళు చూసుకోకుండా కప్పించుకున్నారు’ అని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో ఉదహరించారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు లేవని తెలిపారు. BRS ఫిర్యాదుపై స్పీకర్‌దే తుది నిర్ణయమన్నారు.
News September 19, 2025
ఈనెల 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించలేం: CM రేవంత్

TG: SEP 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో CM రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎప్పుడు నిర్వహించాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈనెల 30లోపు నిర్వహించాలంటూ HC ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను HCకి వివరించి, ఏం చేయాలో కోరుతామన్నారు. CM వ్యాఖ్యలను బట్టి ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనని స్పష్టమవుతోంది.