News November 30, 2024
మెడికల్ కాలేజీల ఆస్తులు జప్తు చేసిన ఈడీ
తెలంగాణలో మెడికల్ కాలేజీలకు చెందిన రూ.9.71 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఇందులో మల్లారెడ్డి కాలేజీ రూ.2.89 కోట్లు, MNR కాలేజీ రూ.2.01 కోట్లు, చల్మెడ ఆనందరావు కాలేజీ రూ.3.33 కోట్ల ఆస్తులున్నాయి. పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసి మేనేజ్‌మెంట్ కోటాలో అమ్ముుకున్నట్లు ఆయా కాలేజీలపై ఆరోపణలొచ్చాయి. దీంతో గతేడాది జూన్‌లో రాష్ట్రంలోని 16 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించి, కేసులు నమోదు చేసింది.
Similar News
News November 30, 2024
24 గంటల్లో శిండే పెద్ద నిర్ణయం తీసుకుంటారు: సంజయ్ శిర్సత్
మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయమై స్పష్టత రాని నేపథ్యంలో శిండే వర్గం నేత సంజయ్ శిర్సత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 24 గంటల్లో షిండే పెద్ద నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. కాగా సీఎం ఎవరనేది అమిత్ షానే నిర్ణయిస్తారని తెలిపారు. డిసెంబర్ 2న ప్రమాణస్వీకారం చేపట్టే అవకాశం ఉందన్నారు. మరోవైపు శిండే ఆకస్మాత్తుగా సొంత గ్రామానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
News November 30, 2024
షమీకి మళ్లీ గాయం..?
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ గాయం నుంచి కోలుకుని సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా మరోసారి గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఓ మ్యాచ్‌లో బౌలింగ్ వేసే సమయంలో షమీ నడుం నొప్పితో విలవిల్లాడినట్లు సమాచారం. తమ వైద్యాధికారులు షమీకి ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్నారని BCCI వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో షమీ ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ఆడటం అనుమానంగా మారింది.
News November 30, 2024
2024: ఈ ముద్దుగుమ్మలు కనిపించలే..
ఈ ఏడాది పలువురు హీరోయిన్లు టాలీవుడ్‌లో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ జాబితాలో సమంత, అనుష్క, రాశీ ఖన్నా, పూజా హెగ్డే, కీర్తి సురేశ్, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. వీరిలో కొందరు ఇతర భాషా చిత్రాల్లో కనిపిస్తున్నా తెలుగులో మాత్రం ఒక్క సినిమా చేయలేదు. కాగా అనుష్క, కీర్తి సురేశ్, రాశీ ఖన్నా నటిస్తోన్న సినిమాలు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. మిగిలిన భామలూ కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి.