News October 9, 2024
10 గంటల పాటు అజారుద్దీన్‌ను విచారించిన ఈడీ

TG: హెచ్‌సీఏలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌ను ఈడీ 10 గంటల పాటు విచారించింది. తాను విచారణకు పూర్తిగా సహకరించినట్లు ఆయన తెలిపారు. తనపై పెట్టిన కేసులన్నీ అక్రమమేనని అన్నారు. కుట్రతోనే తనపై కేసులు పెట్టారని దుయ్యబట్టారు.
Similar News
News January 12, 2026
నాణ్యతలో రాజీ పడొద్దు.. విద్యార్థుల కిట్‌పై రేవంత్

TG: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువుల కిట్‌కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని CM రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ‘వేసవి సెలవుల తర్వాత బడులు ప్రారంభమయ్యే నాటికి కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దు. యూనిఫామ్, బెల్ట్, టై, షూస్, బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర వస్తువులను అందించేందుకు ప్రొక్యూర్మెంట్ ప్లాన్లు సిద్ధం చేయాలి’ అని ఆదేశించారు.
News January 12, 2026
కోల్డ్ వేవ్స్.. వీళ్లకు ముప్పు ఎక్కువ!

మరికొన్నిరోజులు చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని IMD హెచ్చరించింది. దీంతో గుండె, లంగ్స్, కిడ్నీ వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ‘చలికాలంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. నీరు తీసుకోవడం తగ్గుతుంది. ఉప్పు వాడకం పెరుగుతుంది. ఇవి BP, హార్ట్ అటాక్ ప్రమాదాన్ని పెంచుతాయి’ అని కార్డియాలజీ ప్రొఫెసర్ రాజీవ్ నారంగ్ తెలిపారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.
News January 12, 2026
మద్యం బాటిల్‌పై రూ.10 పెంపు

AP: మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.99 MRP ఉన్న మద్యం బాటిళ్లు, బీర్లు, వైన్ బాటిళ్లు మినహా మిగతావాటికి రూ.10 చొప్పున పెంచింది. దీంతో ఏటా రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బార్లు, మద్యం షాపుల్లో వేర్వేరు ధరలు ఉండటంతో అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించాలని నిర్ణయించింది. దీంతో బార్లు, మద్యం షాపుల్లో ధరలు ఒకేలా ఉండే అవకాశం ఉంది.


