News March 27, 2024

కేరళ సీఎం కుమార్తె‌పై ఈడీ మనీలాండరింగ్ కేసు

image

కేరళ సీఎం పినరయి విజయన్‌ కుమార్తె వీణపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. అక్రమ చెల్లింపులకు సంబంధించి వీణ సహా మరికొందరిపై ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా 2017-2020 మధ్య కొచ్చిన్ మినరల్స్ & రుటైల్ లిమిటెడ్ సంస్థ వీణకు రూ.1.72కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ డీల్‌లో CPI(M) సహా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని UDF పక్షం నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.

Similar News

News April 11, 2026

తిరుపతి జిల్లాలో సరికొత్త మోసం.. జాగ్రత్త!

image

తిరుపతి జిల్లాలో కొన్ని ఇంటర్ కాలేజీలు సరికొత్త మోసానికి తెరలేపుతున్నాయి. తల్లిదండ్రులకు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు చూపించి అవే కాలేజీలని నమ్మించి ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటారు. వివిధ బ్రాంచ్‌లకు చెందిన ఆ బిల్డింగ్‌లకు పర్మిషన్లు ఉండవు. ఎవరైనా అధికారులు అడిగితే కోచింగ్ సెంటర్లని తప్పించుకుంటారు. లోపల మాత్రం కాలేజీలు నిర్వహిస్తుంటారు. తల్లిదండ్రులు ఇలాంటి కాలేజీల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

News April 11, 2026

25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు ప్రకటన

image

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో కానిస్టేబుల్ (GD) ఉద్యోగాల పరీక్షల తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఏప్రిల్ 27 నుంచి మే చివరి వరకు దేశంలోని వివిధ సెంటర్లలో <>ఎగ్జామ్స్<<>> జరుగుతాయని పేర్కొంది. కాగా ఫిబ్రవరి 23నే పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, NCBలో మొత్తం 25,487 ఉద్యోగాలు ఉన్నాయి.
Share It

News April 11, 2026

రేపటి వరకు వర్షాలు!

image

ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు ప్రాంతంలో సముద్ర మట్టానికి 0.9కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపు ఉదయం వరకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే ఆస్కారముందని వివరించింది.