News January 4, 2025
విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

AP: కాకినాడ పోర్టు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలోనూ ఓ సారి ఈడీ నోటీసులు ఇవ్వగా, అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో ఆయన హాజరుకాలేదు. తాజా నోటీసుల నేపథ్యంలో VSR విచారణకు హాజరవుతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది. కాకినాడ పోర్టులో కేవీ రావు వాటాలను బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Similar News
News January 19, 2026
పెద్దపల్లి: సర్పంచ్ల ‘శిక్షణ’ షురూ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లకు 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాలకు మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. సోమవారం కమాన్‌పూర్, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, పాలకుర్తి, కాల్వ శ్రీరాంపూర్ మండలాల సర్పంచ్‌లు శిక్షణా కేంద్రానికి హాజరయ్యారు.
News January 19, 2026
బిచ్చగాడి ఆస్తుల చిట్టా.. దెబ్బకు ఆఫీసర్లే షాకయ్యారు!

MPలోని ఇండోర్‌లో అధికారులకు షాకిచ్చాడో బిచ్చగాడు. బెగ్గర్లు లేని సిటీగా మార్చాలని డ్రైవ్ నిర్వహిస్తుండగా సరాఫా బజార్లో మంగీలాల్ అనే వికలాంగుడు కనిపించాడు. ఆరా తీయగా అతడి ఆస్తుల చిట్టా బయటపడింది. 3 ఇళ్లు, 3 ఆటోలు, ఓ కారు ఉన్నాయి. ఆటోలను అద్దెకు తిప్పుతుండగా, కారు కోసం ప్రత్యేకంగా డ్రైవర్‌ను పెట్టుకున్నాడు. రోజుకు ₹500-1000 భిక్షాటనతో సంపాదిస్తున్నాడు. బంగారు వ్యాపారులకు అప్పు కూడా ఇస్తాడట.
News January 19, 2026
కవిత కొత్త పార్టీకి సన్నాహాలు.. స్ట్రాటజిస్ట్‌గా పీకే

TG: జాగృతి చీఫ్ కవిత ఉగాది వేళ కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఆమె పార్టీ కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగారు. ఇటీవల 5 రోజులు హైదరాబాద్‌లోనే మకాం వేసి కొత్త పార్టీపై కవితతో చర్చలు జరిపారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. అంతేకాదు కాంగ్రెస్, బీఆర్ఎస్లోని ఇద్దరు కీలక నేతలతో కూడా పీకే మాట్లాడినట్లు తెలుస్తోంది.


