News January 16, 2025
కేటీఆర్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతోంది. సుమారు 4 గంటలుగా ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. HMDA ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఆరా తీస్తున్నారు. అర్వింద్ కుమార్, BLN రెడ్డి వాంగ్మూలాల ఆధారంగా KTRను క్వశ్చన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా మాజీ మంత్రి చెప్పినట్లే తాము చేశామని ఇటీవల ఈడీ విచారణకు హాజరైన అర్వింద్, రెడ్డి చెప్పినట్లు సమాచారం.
Similar News
News January 16, 2025
87 మంది పిల్లలకు తండ్రి.. NEXT టార్గెట్ ప్రతి దేశంలో ఓ బిడ్డ
USకు చెందిన కైల్ గోర్డీ ప్రపంచ ప్రఖ్యాత స్పెర్మ్ డోనర్. bepregnantnow వెబ్సైట్ ద్వారా ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ దేశాల్లో 87 మంది పిల్లలకు తండ్రయ్యారు. ఈ ఏడాదిలో ఆ సంఖ్య 100కు చేరనుంది. 2026 నాటికి ప్రతి దేశంలో ఓ పిల్లాడికి తండ్రవ్వడమే లక్ష్యమని ఆయన చెబుతున్నారు. గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సాయం చేయడం సంతోషంగా ఉందంటున్నారు.
News January 16, 2025
2047 నాటికి ఏపీ తలసరి ఆదాయం రూ.58.14 లక్షలు
AP: ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.68 లక్షలుగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి ఈ మొత్తం రూ.58.14 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశారు. తాము విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌కు దేశంలోనే తొలిసారి 16 లక్షల వ్యూస్ వచ్చాయన్నారు. వికసిత్ భారత్‌కు కూడా ఈస్థాయిలో స్పందన రాలేదని తెలిపారు. 2047కు 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడమే తమ లక్ష్యమన్నారు.
News January 16, 2025
ఈ ఏడాది 90 కోట్లకు ఇంటర్నెట్ యూజర్లు
దేశవ్యాప్తంగా 2024లో 88.6Cr ఉన్న ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య ఈ ఏడాదిలో 90Crకు చేరుకుంటుందని ఓ రిపోర్టు వెల్లడించింది. మొత్తం వినియోగదారుల్లో 55%(48.8Cr) గ్రామీణ ప్రాంతాల ప్రజలే ఉంటారని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(IAMAI) తెలిపింది. 98% మంది IND భాషల్లోనే నెట్‌ను యూజ్ చేశారంది. తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషల్లో కంటెంట్ విస్తృతంగా అందుబాటులో ఉండటం వల్ల ప్రజాధరణ లభిస్తోందని పేర్కొంది.