News March 13, 2025
నటి ఇళ్లలో ED దాడులు: బంగారం సీజ్!

కర్ణాటక గోల్డ్ స్మగ్లింగ్ కేసులో భాగంగా బెంగళూరులోని 8 లొకేషన్లలో ED దాడులు చేపట్టింది. కోరమంగల సహా నటి రన్యారావుకు చెందిన 2 ఇళ్లు, కేసులో సహ నిందితుడు తరుణ్ ఇంట్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. అధికారులు భారీ స్థాయిలో బంగారం సీజ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎయిర్‌పోర్టులో తన కుమార్తెకు సాయం చేయాలని ఆమె తండ్రి, DGP రామచంద్రారావు కానిస్టేబుల్ బసవరాజును ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి.
Similar News
News March 13, 2025
అసెంబ్లీ వద్ద భారీగా మార్షల్స్ మోహరింపు

తెలంగాణ అసెంబ్లీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి <<15744584>>వ్యాఖ్యలు<<>> తీవ్ర దుమారం రేపాయి. దీంతో సభను స్పీకర్ వాయిదా వేయగా కొద్దిసేపటి క్రితమే తిరిగి పున:ప్రారంభం అయింది. జగదీశ్‌పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అటు సభ వద్ద భారీగా మార్షల్స్‌ను మోహరించారు.
News March 13, 2025
రోహిత్ శర్మ ఎందుకు రిటైరవుతారు?: డివిలియర్స్

రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్లపై మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించారు. ‘ప్రస్తుతం రోహిత్ ఆట మామూలుగా లేదు. కెప్టెన్సీ కూడా అద్భుతంగా చేస్తున్నారు. ఇలాంటి దశలో ఆయనెందుకు రిటైరవుతారు? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ఆడిన తీరు అసాధారణం. నాయకుడిగా ముందుండి నడిపించారు. రిటైర్ కావడానికి కారణమే లేదు. ఆయనపై విమర్శలకూ స్కోప్ లేదు. ఆయన రికార్డులే ఆ మాట చెబుతాయి’ అని పేర్కొన్నారు.
News March 13, 2025
‘కోర్ట్’కు పాజిటివ్ టాక్.. ప్రియదర్శి ఎమోషనల్

ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో రామ్ జగదీశ్ తెరకెక్కించిన ‘కోర్ట్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రీమియర్స్‌లో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రియదర్శి ఎమోషనల్ అయ్యారు. థియేటర్‌లో నేలపై కూర్చొని నిర్మాత నానిని హత్తుకొని తన సంతోషాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను నాని షేర్ చేశారు.