News October 19, 2024

ఎంవీవీ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

image

AP: విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లాసన్స్ బే కాలనీ, మధురవాడ ఆఫీసుల్లో తనిఖీలు సాగుతున్నాయి. అలాగే ఆడిటర్ వెంకటేశ్వరరావు, అనుచరుల ఇళ్లు సహా మొత్తం 5 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. భూకబ్జా ఆరోపణలు, హయగ్రీవ భూముల వివాదంలో ఆయనపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Similar News

News January 2, 2025

తగ్గేదేలే.. 28 రోజుల్లో రూ.1799 కోట్ల వసూళ్లు

image

‘పుష్ప-2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 28 రోజుల్లో రూ.1799కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఒక్క హిందీ వెర్షనే రూ.1000 కోట్లు వసూలు చేసింది. మరోవైపు బుక్ మై షోలో ఇప్పటివరకు 19.66M టికెట్లు అమ్ముడుపోయాయి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని సినీ వర్గాలు తెలిపాయి. అల్లు అర్జున్, రష్మిక నటించిన ఈ మూవీని సుకుమార్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

News January 2, 2025

ఫార్ములా ఈ-రేస్ కేసులో అధికారులకు మళ్లీ నోటీసులు

image

TG: ఫార్ములా ఈ-రేస్ కేసులో అధికారులకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 8, 9 తేదీల్లో తప్పకుండా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా ఇవాళ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరు కాలేదు. తమకు మరింత సమయం కావాలని వారు ఈడీని కోరారు. దీంతో ఈ నెల 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 7న కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది.

News January 2, 2025

31st Night: హెల్తీ ఫుడ్‌కు ఓటేయలేదు!

image

భారతీయులు హెల్తీ ఫుడ్‌కు ప్రాధాన్యమివ్వలేదని అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అదనపు క్యాలరీలు వస్తాయంటున్నా మందులోకి మంచింగ్‌గా ఆలూ భుజియానే తీసుకుంటున్నారని చెప్తున్నారు. 31st నైట్ బ్లింకిట్‌లో 2,34,512 pcs ఆర్డరివ్వడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. 100gr ప్యాకెట్‌తో 600 క్యాలరీలు వస్తాయని, వీటిని తగ్గించుకోవాలంటే 45ని. రన్నింగ్ లేదా 90ని. వేగంగా నడవాల్సి ఉంటుందంటున్నారు.