News March 23, 2024

ఆప్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

image

లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో అరెస్టైన కేజ్రీవాల్, కవిత బంధువులు, అనుచరుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఢిల్లీలోని ఆప్ MLA గులాబ్ సింగ్ ఇంటిపై రైడ్స్ జరుగుతున్నాయి. అదే సమయంలో హైదరాబాద్‌లోని కవిత ఆడపడుచు తదితర బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు.

Similar News

News November 1, 2025

కాశీబుగ్గ ఘటనపై విచారణకు ఆదేశం

image

AP: కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో 9 మంది చనిపోవడం, పలువురు గాయపడటంతో ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలకు దిగింది. స్థానిక, జిల్లా యంత్రాంగం కూడా అక్కడికి తరలింది. ప్రైవేటు ఆలయమైన ఇక్కడ యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

News November 1, 2025

హోమ్ మేడ్ క్యారెట్ సీరం

image

ఈ మధ్యకాలంలో ఫేస్‌గ్లో పెంచుకోవడం కోసం సీరంను ఎక్కువగా వాడుతున్నారు. అయితే మార్కెట్లో దొరికే సీరంలు కొందరికి సరిపడవు. కాబట్టి సహజంగా ఇంట్లోనే క్యారెట్ సీరం ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 తాజాక్యారెట్‌లు తురుముకోవాలి. ఒక పాత్రలో కొబ్బరి, ఆలివ్/ బాదంనూనె వేడి చేసి క్యారెట్ తురుము వేసి 10నిమిషాలు మరిగించాలి. తర్వాత దీన్ని వడకట్టి పొడి సీసాలో భద్రపరచాలి. దీన్ని రోజూ చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

News November 1, 2025

ఏపీలో ఎక్కువ సాగవుతున్న ఆయిల్ పామ్ రకాలు

image

☛ కోస్టారికా: ఏపీలో ఎక్కువగా సాగవుతున్న ఆయిల్ పామ్ రకం ఇది. ఈ చెట్లు చాలా పొడవుగా పెరుగుతాయి. గెలల పరిమాణం పెద్దగా వస్తాయి. ఎక్కువ బరువు ఉంటాయి. ☛ సిరాడ్ షార్ట్: ఈ రకం మొక్క మట్టలు తక్కువ సైజులో వస్తాయి. ఈ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగవు. గెలల సంఖ్య ఎక్కువ. గెలల బరువు తక్కువ బరువు ఉన్నా.. ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల రైతులు ఈ రకం సాగుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.