News June 20, 2024

BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

image

TG: పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌లోని మూడు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Similar News

News February 9, 2026

గొర్రెల మందలో విత్తన పొట్టేలు ప్రాముఖ్యత

image

గొర్రెల మంద పెరగాలన్నా, నాణ్యమైన పిల్ల రావాలన్నా, మందలో ప్రతీ 20-25 గొర్రెలకు మంచి విత్తన పొట్టేలును ఎంపిక చేసుకోవాలి. అది బలంగా, ఎత్తుగా ఉండాలి. చాలా మంది రైతులు తమ మందలో పుట్టిన పిల్లను విత్తనం కోసం ఎంపిక చేసుకుంటారు. దీని వల్ల నాణ్యమైన పిల్ల పుట్టకపోగా, బలహీనంగా, అంగవైకల్యంతో, తక్కువ బరువు, సంతానోత్పత్తికి పనికిరాకుండా ఉంటాయి. అందుకే వేరే మంద నుంచి నాణ్యమైన పొట్టేలును ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

News February 9, 2026

డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే లోన్

image

AP: డ్వాక్రా సంఘాల కోసం ఏర్పాటు చేసిన ‘స్త్రీ నిధి’ పథకాన్ని డిజిటల్ విధానంలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైక్రో ఫైనాన్స్ బారిన పడకుండా దరఖాస్తు చేసుకున్న మహిళలకు 48 గంటల్లో లోన్ అందేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. అలాగే ఒక్కో స్వయం సహాయక సంఘానికి ఇస్తున్న రూ.5 లక్షల లోన్‌ను రూ.8 లక్షలకు పెంచింది.

News February 9, 2026

పూజా మందిరంలో దీపం పెడుతున్నారా?

image

నిత్య దీపారాధనతో ఇంట్లో శుభం కలుగుతుంది. అయితే కొన్ని నియమాలతో మరిన్ని పుణ్యఫలాలు లభిస్తాయి. అవి.. దీపాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదు. తూర్పు వైపు పెడితే ఆరోగ్యం, ఉత్తరం వైపు పెడితే ఐశ్వర్యం సిద్ధిస్తాయి. శివునికి ఎడమ, విష్ణువుకు కుడి వైపు దీపం ఉంచాలి. ఇందుకు ఆవు నెయ్యి శ్రేష్ఠం. ఒకే వత్తితో దీపం వెలిగించరాదు. కాలిన వత్తితో ఓ పరిహారం పాటిస్తే మంచి జరుగుతుంది. అదేంటో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.