News September 8, 2024
9 కిలోల బంగారం సీజ్ చేసిన ఈడీ

బ్యాంక్ మోసానికి సంబంధించిన కేసులో ఓ ఇంట్లో సోదాలు చేస్తున్న ED అధికారులు కళ్లు చెదిరే బంగారం డంప్‌ను గుర్తించారు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో వ్యాపారవేత్త స్వపన్ సాహా నివాసంలో ED సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో రూ.6.5 కోట్ల విలువైన 9 కిలోల బంగారాన్ని గుర్తించింది. దీనికి సంబంధించి సాహా సరైన పత్రాలను చూపకపోవడంతో సీజ్ చేసింది. తదుపరి విచారణ నిమిత్తం సాహాను ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉంది.
Similar News
News December 4, 2025
పొంగులేటి కొడుకు కంపెనీపై కేసు

TG: భూకబ్జా కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. వట్టినాగులపల్లిలో 70 మంది బౌన్సర్లతో వచ్చి ల్యాండ్ చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేశారని, అడ్డుకున్న తమపై దాడి చేశారంటూ పల్లవి షా అనే మహిళ ఫిర్యాదుతో పోలీసులు FIR ఫైల్ చేశారు. NOV 30న ఘటన జరగగా రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటు మరో ఐదుగురిపై తాజాగా కేసు నమోదైంది.
News December 4, 2025
ఈ బౌలింగ్, ఫీల్డింగ్‌తో వరల్డ్ కప్ నెగ్గగలమా?

వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే జట్టు అన్ని విభాగాల్లో టాప్ క్లాస్‌లో ఉండాలి. ప్రస్తుతం IND బౌలింగ్, ఫీల్డింగ్ చూస్తే WC గెలవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. SAతో 2వ వన్డేలో 350+స్కోర్ చేసినా బౌలర్లు పోరాడలేదు. తొలి వన్డేలోనూ తేలిపోయారు. ఫీల్డింగ్‌లోనూ లోపాలు కనిపించాయి. WC-2027కు ముందు భారత్ 20 వన్డేలే ఆడనుంది. అప్పట్లోగా ఈ 2 విభాగాల్లో మెరుగవ్వకుంటే WC మరోసారి కలగానే మిగిలే ప్రమాదం ఉంది.
News December 4, 2025
27 ఎకరాలకు రూ.3,708 కోట్ల ఆదాయం

HYDలో భూమి బంగారమైందంటే ఇదేనేమో. కోకాపేట నియోపొలిస్‌లో ప్రభుత్వం 27 ఎకరాలు విక్రయిస్తే ఏకంగా రూ.3,708 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవాళ మూడో విడత వేలంలో ప్లాట్ నంబర్ 19లో ఎకరం రూ.131 కోట్లు, 20లో ఎకరం రూ.118 కోట్లు పలికింది. మొత్తం 8.04 ఎకరాలను వేలం వేయగా HMDAకు రూ.వెయ్యి కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు రెండు వేలం పాటల్లో రూ.2,700 కోట్లు వచ్చాయి. రికార్డు స్థాయిలో ఎకరం రూ.150 కోట్లకు పైగా పలికింది.


