News March 26, 2024
కవితను 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు అప్పగించాలన్న ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన MLC కవితను జ్యుడీషియల్ రిమాండ్‌కు అప్పగించాలని ఈడీ కోర్టును కోరింది. 15 రోజులు కస్టడీకి పంపాలని అడిగింది. ఈ క్రమంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడు. మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. మూడో నిందితుడు బాండ్ల రూపంలో రూ.50 కోట్లు ఇచ్చాడు. ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు’ అని కవిత వ్యాఖ్యానించారు.
Similar News
News March 23, 2026
IIIT విద్యార్థులు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దు: జూపల్లి

విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులని, కేవలం ఆవేశంతో ఆందోళనలు చేస్తూ తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు హితువు పలికారు. సమస్యలు ఏమైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బాసర IIITలో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల మెరుగుదల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులకు తేల్చి చెప్పారు.
News March 23, 2026
మూడేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

AP: వచ్చే మూడేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని CM చంద్రబాబు తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు వెళ్తున్నాం. ఇప్పటికే రూ.20లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. విశాఖ, అమరావతి, తిరుపతిని 3 రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. భోగాపురం విమానాశ్రయం దాదాపు పూర్తయింది. జులైలో ప్రారంభిస్తాం. రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా ఉత్తరాంధ్ర మారుతుంది’ అని పేర్కొన్నారు.
News March 23, 2026
OFFICIAL: సామ్ కరన్ స్థానంలో శనక

IPL-2026 ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక మార్పు జరిగింది. గాయపడిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ స్థానంలో శ్రీలంక టీ20 కెప్టెన్ దసున్ శనక(రూ.2కోట్లు)ను ఎంపిక చేసింది. గతంలో గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన శనక.. తన అనుభవంతో రాజస్థాన్ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా ఆయన శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 3350కి పైగా రన్స్, 86 వికెట్లు సాధించారు.


