News November 25, 2024
జేఈఈ మెయిన్స్-1 దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్

జేఈఈ మెయిన్స్-1 దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియగా, తప్పుల సవరణకు ఎన్టీఏ అవకాశమిచ్చింది. రేపు, ఎల్లుండి వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ ద్వారా తప్పులు సవరించుకోవచ్చని పేర్కొంది. అభ్యర్థి పేరు, DOB, తల్లిదండ్రుల పేర్లలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. మొబైల్ నంబర్, ఈమెయిల్, ఫొటో, అడ్రస్ మార్చుకునేందుకు అవకాశం లేదు.
Similar News
News December 8, 2025
DRDO CFEESలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

DRDO అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్ప్లోజివ్& ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (CFEES)లో 38 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరుతేదీ. టెన్త్, ఇంటర్, ITI ఉత్తీర్ణులై, 18- 27ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్లో సడలింపు ఉంది. ముందుగా ncvtmis.gov.in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టైపెండ్ నెలకు రూ.9600 చెల్లిస్తారు. https://www.drdo.gov.in/
News December 8, 2025
నాణ్యత లేని పాల వల్లే డెయిరీఫామ్ వైపు అడుగులు

మండి నగరంలో పాల నాణ్యత పట్ల అసంతృప్తితోనే సకీనా ఈ రంగంలోకి అడుగు పెట్టారు. స్థానిక పాడి రైతు చింతాదేవి, YouTubeలోని పాడిపరిశ్రమలో రాణిస్తున్న వారి అనుభవాలను తెలుసుకొని ముందుకుసాగారు. 2024లో తన దగ్గర ఉన్న రూ.1.25 లక్షలు, బ్యాంకు నుంచి రూ.2లక్షల రుణంతో.. పంజాబ్ నుంచి హోల్స్టెయిన్ ఫ్రైసియన్(HF) ఆవులను కొని ఫామ్ ప్రారంభించారు. తొలుత తక్కువ ఆవులే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 14కు చేరింది.
News December 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 90

ఈరోజు ప్రశ్న: రాముడు, ఆంజనేయుడి మధ్య యుద్ధం జరిగినట్లు కొన్ని పురాణాలు చెబుతున్నాయి. మరి ఆ యుద్ధం ఎందుకు జరిగిందో మీకు తెలుసా?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


