News April 6, 2024
పుష్పరాజ్-శ్రీవల్లి ఎడిట్ అదిరింది: పుష్ప టీమ్

పుష్ప-2 నుంచి వరుస అప్డేట్లు ఇస్తూ మూవీ టీమ్ జోరు పెంచింది. తాజాగా రష్మిక బర్త్డే సందర్భంగా ఆమె లుక్ను విడుదల చేసింది. దీంతో అమ్మవారి గెటప్లోని అల్లు అర్జున్, శ్రీవల్లి లేటెస్ట్ ఫొటోను ఎడిట్ చేసి ‘అర్ధనారీశ్వర’ అంటూ ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఎడిట్ అదిరిపోయిందంటూ పుష్ప టీమ్ రిప్లై ఇచ్చింది. ఇలాంటివి ఇంకా రాబోతున్నాయని పేర్కొంది.
Similar News
News December 26, 2025
ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు జరిగే CWC సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నట్లు సమాచారం.
News December 26, 2025
అసెంబ్లీకి కేసీఆర్?

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఎర్రవల్లి ఫామ్హౌస్లో మాజీ మంత్రులతో సమావేశంలో చెప్పినట్లు సమాచారం. సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపై వారికి దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే ఆయన కూడా అసెంబ్లీకి వచ్చి సర్కార్ను ఇరుకున పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
News December 26, 2025
చరిత్ర సృష్టించిన దీప్తీ శర్మ

భారత మహిళా క్రికెటర్ దీప్తీ శర్మ T20I ఫార్మాట్లో 150 వికెట్లు పూర్తి చేసుకున్నారు. శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్లో ఈ అరుదైన ఘనత సాధించారు. భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్, ఓవరాల్గా రెండో మహిళగా నిలిచారు. తొలిస్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ మేగన్(151) ఉన్నారు. ఇదే మ్యాచ్లో 151వ వికెట్ను కూడా తీసి ఆమె రికార్డును దీప్తి సమం చేశారు.


