News April 4, 2024
నన్ను అవమానించడమే ఈడీ లక్ష్యం: కేజ్రీవాల్
తనను అవమానించడమే లక్ష్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ED తనను అరెస్ట్ చేసిందని CM కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న ఆయన.. ఈ కేసులో తనకు మధ్యంతర ఉపశమనం కలిగించాలని ఢిల్లీ హైకోర్టుకు విన్నవించారు. ఎన్నికలకు ముందు ఈ అరెస్టు చేయడంపై కేజ్రీవాల్ తరఫు లాయర్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. కాగా ఇదే కేసులో మరో ఆప్ నేత సంజయ్‌సింగ్ జైలు నుంచి విడుదలయ్యారు.
Similar News
News November 9, 2024
ప్రియాంకా గాంధీ తరఫున సీతక్క ప్రచారం
TG: కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ తరఫున మంత్రి సీతక్క ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆమె రెండు, మూడు రోజులు అక్కడే ఉండి ఓట్లు అభ్యర్థించనున్నారు. కాగా నిన్నటివరకు సీతక్క మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.
News November 9, 2024
‘హాట్’ యోగా అంటే?
ఒక గదిలో సాధారణం కంటే అధిక టెంపరేచర్‌ను మెయింటేన్ చేస్తూ చేసేదే ‘హాట్’ యోగా. దీనివల్ల కేలరీలు అధికంగా ఖర్చై బరువు తగ్గుతారని నమ్మకం. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని యోగా నిపుణులు చెబుతున్నారు. హాట్ యోగా వల్ల డీహైడ్రేషనై శరీరంలోని ఫ్లూయిడ్ అంతా ఆవిరైపోతుందని చెబుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో చర్మ సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. హాట్ యోగా చలి అధికంగా ఉండే దేశాల్లోని ప్రజల కోసమని పేర్కొన్నారు.
News November 9, 2024
రాహుల్ దిశానిర్దేశంలేని క్షిపణి: అస్సాం సీఎం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నియంత్రణ లేదంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు మండిపడ్డారు. ‘రాహుల్ ప్రస్తుతం నియంత్రణ లేని క్షిపణిలా ఉన్నారు. సోనియా శిక్షణనివ్వకపోతే మున్ముందు దారీతెన్నూ లేని క్షిపణిగా మారతారు. ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. ఝార్ఖండ్‌కు వచ్చిన రాహుల్ తీవ్రవాదుల గురించి ఒక్క ముక్కా మాట్లాడలేదు. ఆయన గిరిజనులకు, వెనుకబాటు వర్గాలకు వ్యతిరేకి’ అని విమర్శించారు.