News March 10, 2025
ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

TG: బీఎడ్‌లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఎల్లుండి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 24వరకు లేట్ ఫీజుతో స్వీకరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, మిగతావారు రూ.750 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
వెబ్సైట్: https://edcet.tgche.ac.in
Similar News
News March 10, 2025
లలిత్ మోదీకి బిగ్ షాక్

IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి <<15692963>>వనువాటు<<>> ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని జోతం నపట్ పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించారు. కొన్ని వారాల క్రితం లలిత్ మోదీ వనువాటు పౌరసత్వాన్ని పొందిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన, భారత్‌లో దర్యాప్తును తప్పించుకునేందుకు అక్కడి పౌరసత్వాన్ని పొందారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
News March 10, 2025
కూల్ డ్రింక్ మూత, పల్లి గింజకు చిన్నారులు బలి!

TG: చిన్నపిల్లలకు ఏది తినాలి, ఏది తినకూడదో తెలియదు. ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటారు. అందుకే తల్లిదండ్రులు వారిని నిత్యం గమనిస్తూ ఉండాలి. తాజాగా బాటిల్ మూత మింగి ఓ చిన్నారి, గొంతులో పల్లీ ఇరుక్కొని మరో బాలుడు ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల(D) ఊట్కూర్‌లో రుద్ర అయాన్ (9నెలలు) కూల్ డ్రింక్ మూత మింగి చనిపోగా, MHBD జిల్లా నాయకపల్లిలో అక్షయ్(18 నెలలు) గొంతులో పల్లీ ఇరుక్కుని ఊపిరాడక మృతిచెందాడు.
News March 10, 2025
భారత జట్టుకు, జనసేనకు ఒకే విధమైన పోలికలు: నాగబాబు

విజయానికి అదృష్టంతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైందని జనసేన నేత నాగబాబు అన్నారు. జనసేనను భారత జట్టుతో పోల్చారు. ‘IND ఒక్క టాస్ గెలవకుండా అన్ని మ్యాచ్‌లు గెలిచి 12 ఏళ్లకు CT సాధించింది. ఒక్క MLA కూడా లేకుండా 12 ఏళ్లకు 100% స్ట్రైక్ రేట్‌తో గెలిచి JSP రాజ్యాధికారంలో భాగస్వామ్యమైంది. ఈ రెండింటికీ ఒకే విధమైన పోలికలు. ప్రణాళిక, ప్రాతినిధ్యం, కూర్పు, కసరత్తు, అంకితభావం, ఐకమత్యం’ అని ట్వీట్ చేశారు.