News April 8, 2025
ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసింది. బీఈడీ, ప్రత్యేక బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్‌సెట్‌ను నిర్వహిస్తారు. అభ్యర్థులు వచ్చే నెల 14లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ కన్వీనర్ స్వామి తెలిపారు. ఈ ఏడాది జూన్ 5న పరీక్ష జరగనుంది. ఫీజు వివరాలు: ఓసీ-రూ.650, బీసీ-రూ.500, ఎస్సీ, ఎస్టీ-రూ.450.
Similar News
News April 8, 2025
షారుఖ్ మూవీలో తల్లి పాత్రలో దీపికా!

బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’లో దీపికా పదుకొణె అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆమె సుహానా ఖాన్ తల్లిగా, షారుఖ్ మాజీ ప్రేయసిగా కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కథలో ప్రధాన సంఘర్షణలకు ఈ పాత్ర కేంద్రంగా ఉంటుందని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ‘పఠాన్’ రూ.1050 కోట్లు వసూలు చేసింది.
News April 8, 2025
త్వరలో బంగ్లాకు తిరిగొస్తా: షేక్ హసీనా

భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బంగ్లాకు తిరిగివస్తానని, అవామీ లీగ్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. SMలో వారితో మాట్లాడుతూ బంగ్లా చీఫ్ అడ్వైజర్ యూనస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రజలంటే ప్రేమ లేదన్నారు. అధిక వడ్డీలకు రుణాలిచ్చి విదేశాల్లో విలాసవంతంగా బతికారన్నారు. ఆయన అధికార వాంఛ బంగ్లాను తగలబెడుతోందని దుయ్యబట్టారు.
News April 8, 2025
సింగపూర్ అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి

సింగపూర్‌లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ చిన్నారి మరణించారు. ఇదే ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో 19 మంది గాయపడ్డారు. కాగా ఇవాళ సాయంత్రం పవన్ సింగపూర్ వెళ్లనున్నారు.