News June 11, 2024
ఇవాళ ఎడ్సెట్ ఫలితాలు

తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలను ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు. మే 23న జరిగిన ఈ పరీక్షకు 33,789 మంది దరఖాస్తు చేసుకోగా, 87 శాతం మంది హాజరయ్యారు. సెషన్-1లో 14,633 మంది, సెషన్-2లో 14,830 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. https://edcet.tsche.ac.in వెబ్సైట్లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.
Similar News
News November 19, 2025
వినాయకుడిని ఏ సమయంలో పూజించడం ఉత్తమం?

బుధవారం వినాయకుడి పూజలకు శ్రేష్ఠం. ఉదయంతో పోల్చితే సాయంత్ర పూజల వల్ల విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. స్కంద పురాణం ప్రకారం.. సంధ్యా సమయంలో స్వామివారిని పూజిస్తే మనలోని ప్రతికూల శక్తులన్నీ హరించుకుపోతాయి. కొబ్బరి నూనె దీపం వెలిగించి, 21 గరికెలు సమర్పించి, గణేశుడి పంచరత్న స్తోత్రాన్ని పఠిస్తే.. బుద్ధి చతురత, వాక్శుద్ధి కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
News November 19, 2025
దివిసీమ జల ప్రళయానికి 48 ఏళ్లు

AP: దివిసీమ జల ప్రళయానికి నేటితో 48 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 నవంబర్ 19న కడలి ఉప్పొంగడంతో ఊళ్లు శవాల దిబ్బలుగా మారాయి. కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి తదితర ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎంతో మంది జల సమాధి అయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం 14 వేల మందికిపైగా చనిపోయారు. ఘటన జరిగిన 3 రోజుల వరకు బాహ్య ప్రపంచానికి ఈ విషయం తెలియకపోవడం అత్యంత బాధాకరం.
News November 19, 2025
నేడు పుట్టపర్తికి మోదీ రాక

AP: సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుట్టపర్తికి రానున్నారు. బాబా మందిరాన్ని, మహాసమాధిని ఆయన సందర్శించనున్నారు. ఈ సందర్భంగా బాబా స్మారక నాణెం, స్టాంపులను విడుదల చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు సహా ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.


