News September 22, 2025
30న ఎడ్‌సెట్ స్పాట్ అడ్మిషన్స్

TG: B.Ed కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఈనెల 30న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాలేజీల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు రేపు https://edcetadm.tgche.ac.inలో అందుబాటులో ఉంటాయన్నారు. ర్యాంక్ కార్డు, టెన్త్, ఇంటర్, డిగ్రీ మార్కుల మెమోలు, ఇతర సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
Similar News
News September 22, 2025
₹500 కోట్లతో NTTPS కాలుష్య నివారణ పనులు

AP: NTTPS కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. పొల్యూషన్ రాకుండా ప్లాంటులో ₹500కోట్లతో పరికరాలు సమకూరుస్తున్నామన్నారు. ’పాండ్‌యాష్ నిల్వ, తరలింపుతోనే ఈ సమస్య. కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు, యాష్ రవాణాకు టెండరింగ్ ఏజెన్సీని నియమించాం. ఏజెన్సీ ఏర్పాటుపై అపోహలొద్దు.’ అని పేర్కొన్నారు. స్థానికుల ఉపాధి దృష్ట్యా ఉచితంగా బూడిద లోడింగ్, రవాణా ఖర్చులు అందిస్తున్నామన్నారు.
News September 22, 2025
రాష్ట్రంలో 42 పోస్టులు.. దరఖాస్తుల సవరణకు కొన్ని గంటలే ఛాన్స్

<
News September 22, 2025
భర్తలను కాపాడుకున్న భార్యలు!

భర్త ప్రాణాల్ని కాపాడుకొనేందుకు భార్య చూపే ప్రేమ, త్యాగాలకు సరిహద్దులు లేవని ఈ ఘటన మరోసారి నిరూపించింది. నవీ ముంబైలో ప్రాణాంతక వ్యాధితో ఇద్దరు భర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్ చేద్దామంటే కుటుంబీకుల రక్తం మ్యాచ్ అవ్వకపోవడంతో ఒకరి భర్త కోసం మరొకరు లివర్‌ను దానం చేసి వారి ప్రాణాలు కాపాడారు. ఆపరేషన్ విజయవంతమై నలుగురూ క్షేమంగా ఉన్నారు. భార్యల త్యాగాన్ని నెటిజన్లు ప్రశంసింస్తున్నారు.