News November 14, 2024
14,000 మంది విద్యార్థులతో విద్యా దినోత్సవం
TG: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విజయోత్సవాల్లో భాగంగా తొలిరోజు విద్యార్థులతో విద్యా దినోత్సవానికి ఏర్పాట్లు చేసింది. నేడు HYDలోని LB స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో 14,000 మంది విద్యార్థులు పాల్గొంటారు. కాగా SCERT కార్యాలయంలో నిర్వహించే ‘మాక్ అసెంబ్లీ’కి CM రేవంత్ హాజరవుతారు.
Similar News
News November 14, 2024
వారికి న్యాయ సహాయం చేస్తాం: వైసీపీ
AP: సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు YCP కీలక నిర్ణయం తీసుకుంది. వారికి న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం-అప్పలరాజు, శ్యామ్ ప్రసాద్, తూర్పుగోదావరి-జక్కంపూడి రాజా, వంగా గీత, గుంటూరు-విడదల రజినీ, డైమండ్ బాబు, ప్రకాశం-TJR సుధాకర్, VRరెడ్డి, నెల్లూరు-R ప్రతాప్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చిత్తూరు- గురుమూర్తి, మోహిత్ రెడ్డి, కడప-సురేశ్ బాబు, రమేశ్ యాదవ్.
News November 14, 2024
VIRAL: తాజ్మహల్ కనిపించట్లేదు!
ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. గాలి కాలుష్యంగా మారడంతో కొన్ని అడుగుల దూరంలో ఉన్న వస్తువులను కూడా చూడలేకపోతున్నారు. దీనిని కళ్లకు కట్టినట్లు చూపెట్టే ఫొటోలు వైరలవుతున్నాయి. ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ సందర్శనకు వెళ్లిన పర్యాటకులు ‘తాజ్మహల్ కనిపించట్లేదు.. ఎక్కడుందో కనిపెట్టాలి’ అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు.
News November 14, 2024
రేపు 2 విశేషాలు.. మార్కెట్లకు సెలవు
భారత స్టాక్మార్కెట్లు శుక్రవారం పనిచేయవు. కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 15న ఈక్విటీ, డెరివేటివ్స్ మార్కెట్లకు సెలవు. కమోడిటీస్ మార్కెట్లు మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేస్తాయి. దీంతో మార్కెట్ వర్గాలకు 3 రోజుల విరామం లభించినట్టైంది. ప్రస్తుతం దేశీయ బెంచ్మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా రెండోవారమూ పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ చెరో 2%, బ్యాంకు నిఫ్టీ 3% తగ్గాయి.