News August 29, 2025
విద్యాశాఖ నివేదిక.. కోటి దాటిన టీచర్ల సంఖ్య

దేశంలో టీచర్ల సంఖ్య కోటి దాటినట్లు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ నివేదికలో కేంద్ర విద్యాశాఖ తెలిపింది. 2023-24 విద్యా సంవత్సరంలో టీచర్ల సంఖ్య 98,07,600 కాగా, 2024-25లో 1,01,22,420కి చేరింది. ఒకే టీచరున్న స్కూల్స్ 1,04,125, ఒక్క విద్యార్థీ లేని పాఠశాలలు దేశంలో 7,993 ఉన్నాయి. అత్యధిక టీచర్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఫస్ట్ UP ఉండగా.. TG 10, AP 12వ స్థానంలో ఉన్నాయి.
Similar News
News January 5, 2026
వరి నాట్లు.. ఇలా చేస్తే అధిక ప్రయోజనం

వరి రకాల పంట కాలాన్ని బట్టి 22-28 రోజుల వయసుగల నారును నాట్లు వేసుకోవాలి. వరి నారు కొనలను తుంచి నాటితే కాండం తొలుచు పురుగు, ఇతర పురుగుల గుడ్లను నాశనం చేయవచ్చు. నాట్లు పైపైనే 3సెంటీమీటర్ల లోతులోనే నాటితే పిలకలు ఎక్కువగా వస్తాయి. నాటేటప్పుడు పొలంలో ప్రతి 2 మీటర్ల దూరానికి 20 సెం.మీ కాలిబాటలు వదలాలి. కాలిబాటలు తూర్పు పడమర దిశగా ఉంచాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు బాగా అంది చీడల సమస్య తగ్గుతుంది.
News January 5, 2026
RARE PHOTO: ఆ రోజుల్లో ఆర్భాటాలే లేవు!

ప్రస్తుతం షూటింగ్ అనగానే నటీనటులు క్యారవాన్లకే పరిమితమవుతున్నారు. కానీ ఒకప్పుడు ఆ ఆర్భాటాలు ఉండేవి కావు. షూటింగ్ విరామంలో నటీనటులందరూ కలిసి ఒకే చోట భోజనాలు చేసేవారు. ఆనాటి రోజులను గుర్తుచేసే పాత ఫొటో ఒకటి తాజాగా వైరలవుతోంది. సీనియర్ నటులు కోట, తనికెళ్ల, AVS, గుండు హన్మంతరావు భోజనం చేస్తుంటే అలీ వడ్డించడం అందులో చూడొచ్చు. ఈ అరుదైన ఫొటో ‘శుభలగ్నం’ సినిమా షూటింగ్‌కు సంబంధించినది.
News January 5, 2026
యాషెస్ 5వ టెస్ట్.. 2వ రోజు పోరాడుతున్న ఆస్ట్రేలియా

యాషెస్ సిరీసులో సిడ్నీ వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో 2వ రోజు ఆట ముగిసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో AUS 166/2 రన్స్ చేసి మరో 218 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (91 నాటౌట్), జేక్ వెదరాల్డ్ (21) 74 బాల్స్‌లో 57 రన్స్ చేసి తొలి వికెట్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. మైఖెల్ నెసర్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 211/3 ఓవర్‌నైట్ స్కోరుతో 2వ రోజు ఆట మొదలుపెట్టిన ENG 384 రన్స్‌కు ఆలౌటైంది.


