News October 8, 2025

విద్యా సంస్థల సమ్మె వాయిదా

image

TG: ఈనెల 13 నుంచి సమ్మెకు దిగుతామన్న ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కాస్త వెనక్కి తగ్గింది. CMతో చర్చిస్తామని ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో సమాఖ్య ప్రతినిధులు సమ్మెను వాయిదా వేశారు. దీపావళిలోగా రూ.300 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. దీంతో OCT 13 నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మె, కళాశాలల బంద్‌ కార్యక్రమాన్ని OCT 23కు వాయిదా వేయాలని నిర్ణయించారు.

Similar News

News February 18, 2026

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు వేళాయే

image

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 24న స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం జరగనుంది. 25న తిరుకళ్యాణం, 26న దివ్య విమాన రథోత్సవం వంటి కీలక ఘట్టాలు నిర్వహిస్తారు. 28న గర్భాలయంలోని మూలవిరాట్టుకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. కాగా ఇప్పటికే యాదగిరిగుట్టను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

News February 18, 2026

కొల్లేటి వ్యవసాయం గొడ్డు వినాశనం

image

కొల్లేరు సరస్సు పరివాహక ప్రాంతం పల్లపు ప్రదేశం కావడంతో వర్షాకాలంలో వరదలు వచ్చి పంటలు పూర్తిగా మునిగిపోతాయి. దీని వల్ల రైతులు ఎంత పెట్టుబడి పెట్టినా పంట చేతికి రాదు. అలాగే భూముల్లో వరద నీరు నిలిచిపోవడం వల్ల గడ్డి కుళ్లిపోయి, పశువులకు మేత కూడా లభించదు. ఫలితంగా మేత లేక, రోగాల బారిన పడి పశువులు చనిపోతాయి. అందుకే కొల్లేటి వ్యవసాయం అటు పంటను, ఇటు పశుసంపదను కూడా ముంచేస్తుందని ఈ సామెత భావం.

News February 18, 2026

దేవాలయంలో ఏ దానంతో ఏ పుణ్యం?

image

గుడిలో వస్తురూపేణా చేసే దానాలు విశేష ఫలితాలనిస్తాయి. శంఖం దానంతో పుణ్యలోక ప్రాప్తి, గంట దానంతో కీర్తి, గజ్జెల దానంతో సౌభాగ్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘ధ్వజస్తంభంతో యశస్సు, జెండాలతో పాపవిముక్తి, సుగంధ ద్రవ్యాలతో రూప సంపత్తి, పందిళ్లు నిర్మిస్తే ధర్మబుద్ధి కలుగుతాయి. ఇలా ఆలయ అభివృద్ధికి, సౌకర్యాలకు చేసే సాయం భక్తులకు ఇహపర సుఖాలు కలుగుతాయి’ అని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతోంది.