News February 4, 2025
EEMT మెరిట్ టెస్ట్ ఫలితాల ప్రకటన

EEMT – 2025 ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయరామరాజు సోమవారం విజయవాడలోని తన కార్యాలయంలో ప్రకటించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 94 మంది 7,10 తరగతుల విద్యార్థులకు రూ 5,03,000లక్షల నగదు బహుమతులను ఈ నెల 28న పంపిణీ చేయనున్నారు. అద్దంకికి సంస్థ కన్వీనర్ పుట్టం రాజు శ్రీరామచంద్రమూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు.
Similar News
News December 6, 2025
జగన్ క్షమాపణ చెప్పాలి: నాగరాజు

బలహీన వర్గాలకు చెందిన ఐపీఎస్ అధికారి గోపినాథ్ జెట్టిని, మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి కిష్ణయ్యను అగౌరవపరుస్తూ మాట్లాడిన వైఎస్ జగన్మెహన్ రెడ్డి వారిరువురికీ వెంటనే క్షమాపణ చెప్పాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు డా.పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. మీలా తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని వారు ఐపీఎస్, ఐఏఎస్ పోస్టులు సంపాదించలేదన్నారు.
News December 6, 2025
నేడు అమెరికాకు మంత్రి లోకేశ్

AP: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. తొలిరోజు డల్లాస్లోని తెలుగువారిని కలుస్తారు. 8, 9వ తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. 10న టొరెంటోలో పర్యటిస్తారు. ఈ 18 నెలల్లో లోకేశ్ అమెరికా వెళ్లడం రెండోసారి కావడం విశేషం. ఇప్పటివరకు US, దావోస్, సింగపూర్ ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు.
News December 6, 2025
శ్రీశైలం: పాతాళగంగ నీరు పచ్చగా ఎందుకు?

చంద్రగుప్త మహారాజు ఓ రాజ్యాన్ని ఓడించి, అంతఃపురంలో ఉన్న రాణిని తన కూతురని తెలియక ఆశించాడు. ఆ విషయం తెలిసినా వెనక్కి తగ్గలేదు. దీంతో చంద్రవతి శ్రీశైలం వచ్చి శివుడిని ప్రార్థించింది. అక్కడకు వచ్చిన చంద్రగుప్తుడు చంద్రవతిని చెడగొట్టబోతుండగా, శివుడు ప్రత్యక్షమయ్యాడు. కామంతో కనులు మూసుకుపోయిన చంద్రగుప్తుడిని పచ్చలబండపై పాతాళగంగలో పడి ఉండమని శాపమిచ్చాడు. అందుకే పాతాళగంగ నీరు పచ్చగా ఉంటుందని కథనం.


