News November 14, 2024
మెట్ఫార్మిన్తో పిండం ఎదుగులపై ప్రభావం
డయాబెటిస్ రోగుల్లో చక్కెర స్థాయులను నియంత్రించడానికి వాడే ఔషధం మెట్ఫార్మిన్. మహిళలకు గర్భదారణ సమయంలో షుగర్ ముప్పును తగ్గించడానికీ దీన్ని వైద్యులు సిఫారసు చేస్తుంటారు. అయితే ఇది పిండం ఎదుగుదలను అడ్డుకునే ఛాన్స్ ఉందని US సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. గర్భస్థ కోతులకు మెట్ఫార్మిన్ను ఇవ్వగా అవయవాల ఎదుగుదలను నియంత్రించిందని తేలింది. ఈ అంశంపై మరింత అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Similar News
News November 14, 2024
‘దేవర’@50 డేస్.. ఎన్ని సెంటర్లలో అంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ 50 డేస్ పూర్తి చేసుకుంది. 52 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శితమైనట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదలైన సంగతి తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
News November 14, 2024
కొత్త పెన్షన్లపై ప్రభుత్వం GOOD NEWS
AP: అర్హులైన పెన్షన్దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెన్షన్దారులు గ్రామంలో ఒకటి, రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని ఆదేశించారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
News November 14, 2024
చంద్రబాబూ.. నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?: రజిని
AP: సూపర్ సిక్స్ హామీలిచ్చి ఎగ్గొట్టిన చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని మాజీ మంత్రి రజిని ప్రశ్నించారు. ‘ఆడబిడ్డ నిధి, దీపం, తల్లికి వందనం, అన్నదాత పథకాలకు ఎన్ని కోట్లు కేటాయించావ్? ఉచిత బస్సుకు అతీగతీలేదు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావ్? రూ.4వేల పింఛన్ ఎంత మందికిచ్చావ్? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తానంటున్నావ్? నాతో సహా మా పార్టీ కార్యకర్తలు నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు’ అని తెలిపారు.