News October 8, 2025
మరిన్ని కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కసరత్తు

TG: కొత్తగా మరిన్ని ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు అనుమతి రాగా నిజామాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి AAI, IAF అప్రూవల్ కోసం ప్రయత్నిస్తోంది. అటు గతంలో సాయిల్ టెస్టులో ఫెయిలైన కొత్తగూడెం దగ్గర అనువైన భూమి వెతికే పనిలో ఉన్నట్లు అధికార వర్గాలు వే2న్యూస్‌కు తెలిపాయి.
Similar News
News October 8, 2025
‘దీపావళి’ వెలుగులు నింపాలి.. విషాదం కాదు!

దీపావళి అనగానే ‘బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. కార్మికులు సజీవ దహనం’ అనే వార్తలు వింటూ ఉంటాం. తాజాగా AP కోనసీమ జిల్లాలోనూ అలాంటి ప్రమాదమే జరిగి ఏడుగురు సజీవదహనమయ్యారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తరచూ బాణసంచా తయారీ కేంద్రాలు, దుకాణాలను తనిఖీ చేయాలి. ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి. కార్మికులకు జీవిత బీమా చేయించాలి. ఈ పండుగ కార్మికుల కుటుంబాల్లో విషాదం నింపకుండా చూసుకోవాలి.
News October 8, 2025
రేపు భారీ వర్షాలు: APSDMA

AP: ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 2 రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రేపు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇవాళ NTR, GNT, బాపట్ల, అనంత, సత్యసాయి తదితర జిల్లాల్లో వర్షం పడింది.
News October 8, 2025
రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ: టీపీసీసీ చీఫ్

TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌కు ఎలాంటి అడ్డంకులు లేవని, షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. కోర్టులో తమ లాయర్లు బలమైన వాదనలు వినిపించారని, రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, కోర్టులోనూ కచ్చితంగా గెలుస్తామన్నారు. రాష్ట్రంలో 90% స్థానాలను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.