News October 9, 2025
100 రోజుల్లోగా పరిష్కారానికి కృషి: పవన్

AP: ఉప్పాడ పర్యటనలో ఉన్న Dy.CM పవన్‌ను ఆ ప్రాంత మత్స్యకారులు కలిసి పారిశ్రామిక కాలుష్యంపై విన్నవించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. పొల్యూషన్ ఆడిట్ చేపట్టాలని PCB అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. 100 రోజుల్లోగా సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతకుముందు వేటకు వెళ్లి మృతిచెందిన 18 జాలర్ల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున బీమా సాయం అందజేశారు.
Similar News
News October 9, 2025
ట్రంప్‌కు మోదీ శుభాకాంక్షలు

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. గాజా శాంతి ప్రణాళిక విజయవంతమైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు ట్వీట్ చేశారు. భారత్, US మధ్య ట్రేడ్ చర్చల పురోగతిపై సమీక్షించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు.
News October 9, 2025
ట్రంప్ మెడలో నోబెల్ మెడల్.. AI ఇమేజ్ షేర్ చేసిన నెతన్యాహు

US ప్రెసిడెంట్ ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఇజ్రాయెల్ PM నెతన్యాహు సూచించారు. అందుకు ఆయన అర్హుడని, ఇజ్రాయెల్-హమాస్ మధ్య సీజ్‌ఫైర్, బందీల విడుదలకు ఎంతో కృషి చేశారని ఆకాశానికెత్తారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ఒకరోజు ముందు నెతన్యాహు తన స్నేహితుడి(ట్రంప్) కోసం ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ట్రంప్ నోబెల్ మెడల్ మెడలో వేసుకోగా నెతన్యాహు సహా మరికొందరు చప్పట్లు కొడుతున్న AI ఇమేజ్‌ను షేర్ చేశారు.
News October 9, 2025
కోటరీ లబ్ధికే PPP పేరిట మెడికల్ కాలేజీల పందేరం: సజ్జల

తన సొంత కోటరీకి లబ్ధి కలిగేలా CBN PPP పేరుతో మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 7 నిర్మాణాలు పూర్తిచేస్తే, అందులో 5 CM ప్రైవేటుకు అప్పగించేశారని విమర్శించారు. పేదలకు అన్యాయం చేస్తున్న ఆయన చర్యలను తమ పార్టీ ప్రతిఘటిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని పోస్టర్‌ను రిలీజ్ చేశారు.