News November 4, 2024
గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని..

TG: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బిజినేపల్లి(M) నందివడ్డేమాన్‌కు చెందిన తిరుపతయ్య(60) లింగాలలో ఉన్న బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి అప్పాయిపల్లిలో ఉన్న మరో బంధువు ఇంటికి వెళ్లేందుకు లింగాల బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడి బజ్జీల బండి వద్ద కోడిగుడ్డు కొనుక్కొని తింటుండగా గొంతులో ఇరుక్కుంది. ఊపిరాడక తిరుపతయ్య కుప్పకూలాడు. స్థానికులు నీళ్లు తాగిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.
Similar News
News December 13, 2025
గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరపాలి: కలెక్టర్

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆమె మాడుగులపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కౌంటింగ్ సమయానికి ప్రారంభించి, ఎటువంటి జాప్యం లేకుండా ఫలితాలను వెల్లడించాలని అధికారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.
News December 13, 2025
రెండు రోజుల్లో బుల్లెట్ నేర్చుకున్న బామ్మ

వయసులో ఉన్న అమ్మాయిలే బుల్లెట్ బండి నడపాలంటే అమ్మో అంటారు. కానీ చెన్నైకి చెందిన 60 ఏళ్ల లతా శ్రీనివాసన్ రెండు రోజుల్లో బుల్లెట్ బండి నడిపి ఔరా అనిపించారు. రిటైర్మెంట్ తర్వాత తనకిష్టమైన బైక్ రైడింగ్ నేర్చుకోవాలనుకున్న లత ఒక అకాడమీలో చేరారు. అక్కడ మొదటి రోజు క్లచ్.. గేర్ మార్చడం నేర్చుకుంది. రెండో రోజునే సెకండ్.. థర్డ్ గేర్‌లో స్మూత్‌గా బైక్ నడపడం మొదలుపెట్టి ట్రెండ్ సెట్టర్‌గా మారారు.
News December 13, 2025
నెలలో జరీబు భూముల సమస్యల పరిష్కారం: పెమ్మసాని

AP: అమరావతిలో జరీబు భూముల సమస్యల పరిష్కారానికి నెల సమయం కోరామని కేంద్ర మంత్రి P.చంద్రశేఖర్ తెలిపారు. సాయిల్ టెస్ట్ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘రాజధాని గ్రామాల్లో శ్మశానాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలను త్వరలోనే కల్పిస్తాం. ల్యాండ్ పూలింగ్‌లో ఇప్పటికీ 2,400 ఎకరాలను కొందరు రైతులు ఇవ్వలేదు. వారితో మరోసారి చర్చిస్తాం. భూసమీకరణ కుదరకపోతే భూసేకరణ చేస్తాం’ అని పేర్కొన్నారు.


