News July 28, 2024

అహంతోనే మేడిగడ్డకు మరమ్మతులు చేయలేదు: కేటీఆర్

image

TG: మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అహం అడ్డువస్తోందని KTR మండిపడ్డారు. అహంతోనే ప్రాజెక్టుకు మరమ్మతులు సరిగ్గా చేయలేదని ఆరోపించారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ద్వారానే రైతుల పొలాలకు నీళ్లు వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభించిన పంప్ హౌస్‌లనూ నిర్మించింది KCR సర్కారే. కాంగ్రెస్ అసమర్థతతో రోజుకు 90TMCల నీరు వృథాగా పోతోంది’ అని ఫైరయ్యారు.

Similar News

News January 25, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 25, 2026

T20 WC నుంచి ఔట్.. BCB వివరణ ఇదే

image

T20 WC నుంచి వైదొలగడం అనేది తమ దేశ ప్రభుత్వ నిర్ణయమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ అమ్జద్ హొస్సేన్ తెలిపారు. ‘మేం ఆడాలనుకున్నాం. కానీ భారత్‌లో ఆడటం సేఫ్ కాదని ప్రభుత్వం వద్దని చెప్పింది. ప్రతి టూర్‌కు ప్రభుత్వ క్లియరెన్స్ తప్పనిసరి’ అని అమ్జద్ వివరించారు. ‘మ్యాచులు జరిగే ఓ సిటీ(కోల్‌కతా) నుంచి మాకు బెదిరింపులు వచ్చాయి. అందుకే అక్కడ ఆడటం సేఫ్ కాదని అనిపించింది’ అని పేర్కొన్నారు.

News January 25, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 25, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.32 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.08 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.23 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.