News March 25, 2025
కునాల్ కమ్రా వివాదంపై స్పందించిన ఏక్నాథ్ శిండే

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వ్యాఖ్యలపై మహారాష్ట్ర DY.CM ఏక్నాథ్ శిండే స్పందించారు. ‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. వ్యంగ్యం మాకు అర్థం అవుతోంది. అయితే దానికీ ఓ హద్దు అంటూ ఉంటుంది’ అని శిండే అన్నారు. డిప్యూటీ సీఎంను ద్రోహి అనడంతో పాటు ఆయనపై వ్యంగ్యంగా కునాల్ పాట పాడటంతో వివాదం మొదలైంది. కాగా తను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని కునాల్ <<15877588>>కమ్రా చెప్పిన<<>> సంగతి తెలిసిందే.
Similar News
News October 18, 2025
బుధవారం నుంచి భారీ వర్షాలు: APSDMA

AP: మంగళవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇది ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అటు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.
News October 18, 2025
పెళ్లి పీటలెక్కనున్న స్మృతి మంధానా!

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇండోర్కు చెందిన సంగీత దర్శకుడు, సినీ నిర్మాత పలాష్ ముచ్చల్తో ఆమె వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇటీవల స్మృతి గురించి అడిగిన ప్రశ్నకు పలాష్ ముచ్చల్ స్పందిస్తూ ‘స్మృతి మంధానా త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది’ అని వెల్లడించారు. వీరిద్దరూ గత 6 ఏళ్లుగా డేటింగ్లో ఉన్నట్లు సమాచారం.
News October 18, 2025
జగన్ విషప్రచారాన్ని అడ్డుకోవాలి: సీఎం

AP: ప్రభుత్వంపై జగన్ చేస్తున్న విష ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మంత్రులతో పాటు పార్టీ నేతలపైనా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. మంత్రులు మాట్లాడారు కదా.. మాకెందుకులే అనుకుంటే సరిపోదని స్పష్టం చేశారు. మీడియా సమావేశాలు పెట్టి జగన్ అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.